
గురుగ్రామ్: సరికొత్త ఫీచర్స్‌తో కొత్తగా తీర్చిదిద్దిన వెన్యూ కార్ల అమ్మకాల కోసం బుకింగ్స్ ప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రకటించింది. రూ. 21,000 కట్టి దేశవ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌లలో లేదా తమ వెబ్‌సైట్ ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చని సంస్థ డైరెక్టర్ తరుణ్ గర్గ్ తెలిపారు. కొత్త వెన్యూలో 60కి పైగా ఫీచర్స్ ఉన్నట్లు ఆయన వివరించారు.
అలెక్సా, గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌లతో హోమ్ టు కార్ (హెచ్2సీ) టెక్నాలజీతో కారులోని అనేక ఫంక్షన్లను ఆపరేట్ చేయొచ్చని గర్గ్ పేర్కొన్నారు. రిమోట్ క్లైమేట్ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, వివిధ డ్రైవ్ మోడ్‌లు (నార్మల్, ఎకో, స్పోర్ట్), 2 స్టెప్ రియర్ రిక్లైనింగ్ సీటు వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం తెలుగు, హిందీ సహా 12 భాషలను సపోర్ట్ చేస్తుందని గర్గ్ పేర్కొన్నారు.
చదవండి: Mercedes Benz: లక్షల కార్లలో లోపాలు, మెర్సిడెస్ బెంజ్‌కు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment