Mercedes-Benz C-Class Car Bookings Open From April 13, India Launch On May 10 - Sakshi
Sakshi News home page

Mercedes-Benz C-Class: మెర్సిడెస్‌ సి–క్లాస్‌ బుకింగ్స్‌ షురూ

Published Thu, Apr 14 2022 12:05 PM | Last Updated on Thu, Apr 14 2022 1:02 PM

Mercedes C Class Car Bookings Open - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్‌ బెంజ్‌ సెడాన్‌ సి–క్లాస్‌ నూతన వర్షన్‌ బుకింగ్స్‌ ప్రారంభించింది. మే 10న ఈ కారు భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. మెర్సిడెస్‌ కస్టమర్లకు ప్రత్యేకంగా ఏప్రిల్‌ 30 వరకు బుకింగ్‌కు అవకాశం ఉంది. ఇతరులకు మే 1 నుంచి బుకింగ్స్‌ మొదలు అవుతాయి. 

తొలుత సి200, సి300డి వేరియంట్లకు, ఆ తర్వాత సి220డి వేరియంట్‌కు బుకింగ్‌ ప్రారంభం అవుతుంది. కస్టమర్లు ఇందుకోసం రూ.50,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఒక కోటికిపైగా సి–క్లాస్‌ కార్లు అమ్ముడయ్యాయి. భారత్‌లో ఈ సంఖ్య 37,000 యూనిట్లకుపైమాటే. 2001 నుంచి భారత్‌లో సి–క్లాస్‌ కార్ల అసెంబ్లింగ్‌ మొదలైంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement