mercedes car
-
18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు.. ఆ డబ్బుతో ఏం చేసిందంటే..?
కెనడా: అదృష్టం తలుపుతడితే ఒక్క రోజులో జీవితాలు మారిపోతాయ్ అంటారు. కెనడాకు చెందిన 18 ఏళ్ల జూలియెట్ లామర్‌కు సరిగ్గా ఇలానే జరిగింది. ఆమె రాత్రికిరాత్రే కోటీశ్వరురాలు అయింది. పుట్టిన రోజు ముందు ఏం కొనాలో తెలియక.. తాతయ్య సూచన మేరకు లాటరీ కొనుగులు చేసిన ఆమెకు ఏకంగా రూ.290 కోట్ల జాక్‌పాట్ తగిలింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకేసారి ఇంతడబ్బు వస్తే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితి ఉంటుంది. కానీ జూలియెట్ మాత్రం అప్పుడే రూ.150 కోట్లు ఖర్చు పెట్టేసింది. లాటరీ డబ్బు రాగానే తన కుటుంబం కోసం ఐదు మెర్సీడెస్ కార్లు కొనుగోలు చేసింది. దీని ధర ఒక్కోటి రూ.2కోట్లు ఉంటుంది. అలాగే రూ.40 కోట్లతో పెద్ద బంగ్లా సొంతం చేసుకుంది. మరో రూ.100 కోట్లు పెట్టి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌కు యజమాని అయింది. ఇక మిలిన డబ్బును మాత్రం భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంది. అంతేకాదు తన తండ్రి సలహాలు సూచనలో ఈ డబ్బుతో పెట్టుబడులు కూడా పెడతానని చెబుతోంది. జూలియెట్ ఇటీవలే తన 18వ పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా ఏమైనా కొనుక్కుందాం అని దుకాణానికి వెళ్లింది. ఏం కొంటే బాగుంటుందని తన తాతయ్యను అడగ్గా.. లాటరీ కొనుగోలు చేయమని అతను సూచించాడు. దగ్గరుండి టికెట్ ఇప్పించాడు. అయితే కొద్ది రోజుల తర్వాత లాటరీ విషయాన్ని జూలియెట్ మర్చిపోయింది. కానీ పక్కింటి వాళ్లు లాటరీలో డబ్బు గెలుచుకున్నారని తెలిసింది. దీంతో తన లాటరీ విషయం గుర్తుకువచ్చింది. వెంటనే మొబైల్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంది. తాను కొనుగోలు చేసిన టికెట్ నంబర్‌కు రూ.290 కోట్లు(48 మిలియన్లు) వచ్చాయని తెలిసి ఆనందంతో పాటు ఆశ్చర్యంలో మునిగిపోయింది. చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
మెర్సిడెస్ సి–క్లాస్ బుకింగ్స్ షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ సెడాన్ సి–క్లాస్ నూతన వర్షన్ బుకింగ్స్ ప్రారంభించింది. మే 10న ఈ కారు భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. మెర్సిడెస్ కస్టమర్లకు ప్రత్యేకంగా ఏప్రిల్ 30 వరకు బుకింగ్‌కు అవకాశం ఉంది. ఇతరులకు మే 1 నుంచి బుకింగ్స్ మొదలు అవుతాయి. తొలుత సి200, సి300డి వేరియంట్లకు, ఆ తర్వాత సి220డి వేరియంట్‌కు బుకింగ్ ప్రారంభం అవుతుంది. కస్టమర్లు ఇందుకోసం రూ.50,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఒక కోటికిపైగా సి–క్లాస్ కార్లు అమ్ముడయ్యాయి. భారత్‌లో ఈ సంఖ్య 37,000 యూనిట్లకుపైమాటే. 2001 నుంచి భారత్‌లో సి–క్లాస్ కార్ల అసెంబ్లింగ్ మొదలైంది. -
కోపంతో మెర్సిడెస్ కారునే కాల్చేశాడు..
ఎక్కడికైనా వెళ్తుంటే దారిలో కారు కానీ, బైక్ కానీ ఆగిపోతే అక్కడే పడేసి వేరే వాళ్లని లిఫ్ట్ అడికి వెళ్తుండటం సినిమాల్లో చూస్తుంటాం. కారు చిన్న ట్రబుల్ ఇస్తే.. పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు హాలివుడ్ సినిమాల్లో చూస్తుంటాం. అయితే అవి డమ్మీ కార్లు కాబట్టి ఎన్నింటిని తగలబెట్టినా పోయేదేమీ ఉండదు. కానీ ఓ యూట్యూబర్ మాత్రం కోపంతో ఏకంగా మెర్సిడెస్ కారునే తగులబెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ తతంగాన్ని అంతా వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన మైఖేల్ లిట్విన్ ఓ యూ ట్యూబర్. సాహసాలు, ప్రాంక్ వీడియోలు చేస్తూ, ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేస్తుంటాడు. ఆయన కొద్ది రోజుల క్రితం ఓ మెర్సిడెస్ కారును కొనుగోలు చేశాడు. అయితే.. ఆ కారు తరుచూ బ్రేక్‌డౌన్ అవుతూ ఇబ్బంది పెడుతోంది. ఆ సమస్య వచ్చినప్పుడల్లా కారును తనకు విక్రయించిన డీలర్ వద్దకు తీసుకెళ్తున్నాడు. ఇలా దాదపు ఐదుసార్లు తన కారును మెర్సిడెజ్ డీలర్ వద్దకు తీసుకెళ్లాడు. కానీ, సమస్యకు పరిష్కారం మాత్రం దొరలేదు. కంప్లైంట్ చేసిన ప్రతిసారి డీలర్ ఆ కారును రెండ్రోజుల పాటు సర్వీస్ సెంటర్లో ఉంచుకుంటున్నాడు. ఆ తర్వాత తిరిగి ఇచ్చేస్తున్నాడు. దానిని ఎన్నిసార్లు రిపేర్‌కు ఇచ్చినా.. సరిగా పనిచేయడం లేదు. దీంతో విసుగు చెందిన మైఖేల్.. రూ. 2.4 కోట్ల విలువైన తన కారును కాల్చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఆ కారును వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకెళ్లి దానిపై పెట్రోల్ పోశాడు. ఆ తర్వాత నేరుగా కొంత దూరం వరకు పెట్రోలు పోసుకుంటూ వెళ్లాడు. అనంతరం తన జేబులో నుంచి లైటర్ తీసి నిప్పుల కొలిమిని వెలిగించాడు. దానికి స్నాక్స్‌ని వేడి చేసుకొని తింటూ హీరో లెవల్లో వెనక్కి తిరిగి నిప్పు అంటించాడు. ఆ మంట నేరుగా వెళ్లి కారును టచ్ చేసింది. దీంతో ఖరీదైన కారు కాలి బూడిదైంది. ఆ దృశ్యాలన్నింటినీ లిట్విన్ విడియో తీసి తన యూట్యూబ్ చాలెన్లో అప్లోడ్ చేశాడు. ప్రస్తుత ఆ వీడియో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఖరీదైన కారును ఎలా కాల్చేయాలనిపించింది?, అమెరికన్లు ఐఫోన్లను పగులగొడితే.. రష్యన్లు మెర్సిడెస్ కార్లనే కాల్చేస్తున్నారు’, ‘ ఈ వీడియోకు వచ్చిన ఆదాయంతో మరో రెండు మెర్సిడెస్ కార్లను కొనుక్కొవచ్చేలే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
వామ్మో.. టీచరమ్మకు ఎంత ఖరీదైన కానుక..!
కువైట్: కువైట్‌కు చెందని ఓ నర్సీరీ విద్యార్థిని తాను అభిమానించే స్కూల్ టీచర్‌కు అరుదైన కానుక అందజేసింది. తనకు చదువు చెప్పినందుకు కృతజ్ఞతగా నూర్ అల్ ఫరిస్ అనే ఐదేళ్ల చిన్నారి తన టీచర్‌కు ఖరీదైన కొత్త లక్సరీ మెర్సిడెస్ కారును బహుమతిగా ఇచ్చింది. 'ఈ కారు నా అభిమాన టీచర్ నదియా'కు అని కారుపై అరబిష్ భాషలో రాయించింది. కారు బ్యానెట్‌పై చిన్నారి నూర్ కూర్చొని ఫొటోలకు పోజిచ్చింది. కువైట్‌లోని కిండర్‌గార్టెన్ స్కూల్లో నూర్ చదువుతోంది. ఇటీవల వార్షిక పరీక్షలు నిర్వహించి, పాఠశాలకు సెలవులు ప్రకటించారు. పైతరగతికి వెళ్తున్న నూర్.. విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా టీచర్‌కు గిఫ్ట్ ఇచ్చింది. ధనవంతుల ఇంట్లో జన్మించిన నూర్ తన స్థాయికి తగ్గట్టు టీచర్‌కు ఖరీదైన కానుకను ఇచ్చింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. నూర్ తల్లి ఇటీవల మరణించింది. ఈ దుఃఖం నుంచి నూర్ కోలుకునేందుకు నదియా టీచర్ ఎంతో సాయం చేసిందట. నూర్‌కు చదువు చెప్పడంతో పాటు మామూలు మనిషి అయ్యేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అందుకు కృతజ్ఞతగా నూర్ తండ్రి నదియాకు ఖరీదైన కానుక ఇచ్చినట్టు మీడియా కథనం. కాగా ఆయన పేరు ఏంటన్నది వెల్లడించలేదు. -
పోలీసులకు చెమటలు పట్టించిన అమ్మడు
న్యూఢిల్లీ: ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అటు పోలీసులు, ఇటు డాక్లర్లు బాధితులకు పట్టపగలే చుక్కలు చూపించడం తెలిసిన వ్యవహారమే. కానీ తప్పతాగి రోడ్డుమీదకు వచ్చిన ఓ యువతి, యువకుడు ఢిల్లీ పోలీసులకు అర్థరాత్రి చలిలో కూడా చెమటలు పట్టించారు. బోయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఖరీదైన కారులో వచ్చిన ఈ అమ్మడు రోడ్డు మీద నానాయాగీ చేసింది. మెట్రో స్టేషన్, రాజీవ్ చౌక్ సమీపంలోని కన్నౌట్ దగ్గర వీరంగం సృష్టించింది. ఫూటుగా మద్యం సేవించిన ఇద్దరూ మంగళవారం అర్ధరాత్రి మెర్సిడెస్ బెంజ్ కారుతో ఒక బైకును ఢీకొట్టారు. అనంతరం ఇద్దరూ కలిసి బైక్‌పై ఉన్న యువకులతో గొడవకు దిగి దాడిచేశారు. ఆ వ్యవహారాన్ని విచారిస్తున్న పోలీసులను కూడా దుర్భాషలాడారు. ఎట్టకేలకు కేసు నమోదుచేసిన పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. అయినా వారికెక్కిన మత్తు దిగలేదు. చికిత్స చేస్తున్న వైద్యులపైనా చిందులేశారు. వారిపట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో అటు పోలీసులు, ఇటు డాక్టర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. దాదాపు మూడు గంటల హై డ్రామా తర్వాత నిందితులు శాంతించారు. ఈ వీడియో ఇపుడు నెట్లో చక్కర్లు కొడుతోంది. WATCH: Girl created ruckus in Delhi's Connaught Place last night after her car rammed into a bike.https://t.co/E3dRqB41QR — ANI (@ANI_news) February 10, 2016 -
ముంబైలో హిట్ అండ్ రన్
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో గురువారం అర్ధరాత్రి హిట్ రన్ అండ్ రన్ ఘటన జరిగింది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపై నుంచి మెర్సిడెజ్ బెంజ్ కారు దూసుకెళ్లింది. దక్షిణ ముంబైలోని మహ్మద్ అలీ రోడ్డులో అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో నలుగురు మహిళలు, చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను జేజే ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలం నుంచి పారిపోయిన కారు డ్రైవర్ ను తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఫుట్ పాత్ పైకి దూసుకొచ్చే ముందు మరో రెండు వాహనాలను కారు ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. జార్ఖండ్ నంబర్ ప్లేటుతో ఉన్నట్టు ఈ కారు ఎవరిదో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, కారులో ఎంత మంది ఉన్నారనేది ఇంకా తెలియలేదని పోలీసు సీనియర్ అధికారి అశోక్ దూధే తెలిపారు. -
0001 నెంబరు.. వెల 8.5 లక్షలు!!
ఫ్యాన్సీ నెంబరు అంటే చాలు.. ఎంతయినా పెట్టేందుకు రెడీగా ఉంటారు కొంతమంది. అలాగే.. ఛత్తీస్‌గఢ్‌లో ఓ పారిశ్రామికవేత్త తనకు కావల్సిన నెంబర్ కోసం ఏకంగా 8.5 లక్షల రూపాయలు చెల్లించారు. అక్కడ కొత్తగా మొదలుపెట్టిన సీహెచ్-01-ఎజడ్ అనే సిరీస్‌లో తొలిసారిగా 0001 నెంబరు వేలానికి వచ్చింది. అంతే.. సోనాలికా గ్రూపు ఛైర్మన్ ఎల్డీ మిట్టల్ ఆ నెంబరును 8.5 లక్షలు వెచ్చించి గెలుచుకున్నారు. ఇంతకుముందు 2013 మే నెలలో సీహెచ్-01-ఏటీ సిరీస్‌లో 0001 నెంబరుకు 9.1 లక్షలు పలికింది. దాని తర్వాత ఇదే అత్యంత ఎక్కువ మొత్తం. సోనాలికా గ్రూపు ప్రధాన కంపెనీ అయిన ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ కోసం కొత్తగా కొన్న మెర్సిడెస్ ఎస్ సిరీస్ కారు కోసం ఈ నెంబరును ఆయన వేలంలో పాడుకున్నారు. ఈ సంవత్సరం మొదట్లోనే మిట్టల్ ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలోకి చేరుకున్నారు.