వామ్మో.. టీచరమ్మకు ఎంత ఖరీదైన కానుక..!
కువైట్: కువైట్కు చెందని ఓ నర్సీరీ విద్యార్థిని తాను అభిమానించే స్కూల్ టీచర్కు అరుదైన కానుక అందజేసింది. తనకు చదువు చెప్పినందుకు కృతజ్ఞతగా నూర్ అల్ ఫరిస్ అనే ఐదేళ్ల చిన్నారి తన టీచర్కు ఖరీదైన కొత్త లక్సరీ మెర్సిడెస్ కారును బహుమతిగా ఇచ్చింది. 'ఈ కారు నా అభిమాన టీచర్ నదియా'కు అని కారుపై అరబిష్ భాషలో రాయించింది. కారు బ్యానెట్పై చిన్నారి నూర్ కూర్చొని ఫొటోలకు పోజిచ్చింది.
కువైట్లోని కిండర్గార్టెన్ స్కూల్లో నూర్ చదువుతోంది. ఇటీవల వార్షిక పరీక్షలు నిర్వహించి, పాఠశాలకు సెలవులు ప్రకటించారు. పైతరగతికి వెళ్తున్న నూర్.. విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా టీచర్కు గిఫ్ట్ ఇచ్చింది. ధనవంతుల ఇంట్లో జన్మించిన నూర్ తన స్థాయికి తగ్గట్టు టీచర్కు ఖరీదైన కానుకను ఇచ్చింది.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. నూర్ తల్లి ఇటీవల మరణించింది. ఈ దుఃఖం నుంచి నూర్ కోలుకునేందుకు నదియా టీచర్ ఎంతో సాయం చేసిందట. నూర్కు చదువు చెప్పడంతో పాటు మామూలు మనిషి అయ్యేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అందుకు కృతజ్ఞతగా నూర్ తండ్రి నదియాకు ఖరీదైన కానుక ఇచ్చినట్టు మీడియా కథనం. కాగా ఆయన పేరు ఏంటన్నది వెల్లడించలేదు.