పోలీసులకు చెమటలు పట్టించిన అమ్మడు | Watch: Drunk girl crashes car into bike, creates nuisance in Delhi's Connaught Place | Sakshi
Sakshi News home page

పోలీసులకు చెమటలు పట్టించిన అమ్మడు

Published Wed, Feb 10 2016 12:31 PM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

పోలీసులకు చెమటలు పట్టించిన అమ్మడు - Sakshi

పోలీసులకు చెమటలు పట్టించిన అమ్మడు

న్యూఢిల్లీ: ఏదైనా యాక్సిడెంట్ జరిగితే  అటు పోలీసులు, ఇటు డాక్లర్లు బాధితులకు పట్టపగలే చుక్కలు చూపించడం తెలిసిన వ్యవహారమే. కానీ  తప్పతాగి రోడ్డుమీదకు వచ్చిన  ఓ యువతి, యువకుడు ఢిల్లీ పోలీసులకు అర్థరాత్రి చలిలో కూడా చెమటలు పట్టించారు.  బోయ్‌ఫ్రెండ్‌తో కలిసి  ఖరీదైన కారులో వచ్చిన ఈ అమ్మడు రోడ్డు మీద నానాయాగీ చేసింది. మెట్రో స్టేషన్, రాజీవ్ చౌక్ సమీపంలోని కన్నౌట్ దగ్గర వీరంగం సృష్టించింది.


ఫూటుగా మద్యం సేవించిన ఇద్దరూ  మంగళవారం అర్ధరాత్రి  మెర్సిడెస్ బెంజ్ కారుతో ఒక బైకును ఢీకొట్టారు. అనంతరం ఇద్దరూ కలిసి బైక్‌పై ఉన్న యువకులతో గొడవకు దిగి దాడిచేశారు. ఆ వ్యవహారాన్ని  విచారిస్తున్న పోలీసులను కూడా దుర్భాషలాడారు.  ఎట్టకేలకు కేసు నమోదుచేసిన పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. అయినా వారికెక్కిన మత్తు దిగలేదు. చికిత్స చేస్తున్న వైద్యులపైనా చిందులేశారు. వారిపట్ల అనుచితంగా ప్రవర్తించారు.  దీంతో అటు పోలీసులు, ఇటు డాక్టర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. దాదాపు మూడు గంటల  హై డ్రామా తర్వాత నిందితులు శాంతించారు. ఈ వీడియో ఇపుడు నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement