
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సలార్.. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే విడుదలైన సలార్ టీజర్, ట్రైలర్‌లోనూ ప్రభాస్ ఎలివేషన్స్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో సలార్ మూవీ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో స్టార్ట్ కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మొదలు కాలేదు.
తాజాగా సలార్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు రాత్రి 8.24 నిమిషాలకు సలార్ నైజాం టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుది. కాగా.. సలార్ చిత్రానికి సంబంధించి తెలంగాణ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Khansaar ee kaadhu, anni theatres housefulls tho erupekkala ❤️🔥❤️🔥#SalaarNizamBookings opens online today at 8.24 PM 🔥#Salaar Nizam Release by @MythriOfficial 💥#SalaarCeaseFire#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai… pic.twitter.com/FqUidhS126
— Mythri Movie Makers (@MythriOfficial) December 19, 2023