Kia EV6 Car Bookings Open in India Ahead of June 2 Launch - Sakshi
Sakshi News home page

కియా ఈవీ6 రూ.3 లక్షలతో బుకింగ్‌: 12 నగరాల్లో మాత్రమే

Published Fri, May 27 2022 9:30 AM | Last Updated on Fri, May 27 2022 12:05 PM

Kia EV E6 coming soon bookings open - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా ఈవీ6 ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ను వచ్చే వారం భారత్‌లో ఆవిష్కరిస్తోంది. పూర్తిగా చార్జ్‌ చేస్తే 528 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్లలో అందుకుంటుంది.

ఆల్‌ వీల్‌ డ్రైవ్, పనోరమిక్‌ సన్‌రూఫ్, మల్టిపుల్‌ డ్రైవ్‌ మోడ్స్, ఫార్వార్డ్‌ కొలీషన్‌ అవాయిడెన్స్‌ అసిస్ట్, లేన్‌ కీప్‌ అసిస్ట్‌తోపాటు 60కిపైగా కనెక్టెడ్‌ ఫీచర్లను జోడించారు. దేశంలో కంపెనీకి ఇది తొలి ఈవీ. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక ఎలక్ట్రిక్‌-గ్లోబల్‌ మాడ్యులర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఇది రూపుదిద్దుకుంది.

ఈవీ6 బుకింగ్స్‌ ప్రారంభించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. పూర్తిగా తయారైన 100 యూనిట్ల ఈవీ6 వాహనాలను తొలుత దిగుమతి చేసుకుంటారు. కియా ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా లేదా 12 నగరాల్లో ఎంపిక చేసిన 15 డీలర్‌షిప్‌ కేంద్రాల్లో మాత్రమే బుకింగ్‌కు అవకాశం ఉంది. కస్టమర్లు రూ.3 లక్షలు చెల్లించి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement