అంతర్జాతీయ ప్రీమియం మోటర్‌సైకిల్స్ కంపెనీ బీఎండబ్ల్యూ మోటరాడ్ (BMW Motorrad) మరో ఎలక్ట్రిక్ టూవీలర్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. సీఈ 02 (CE 02) పేరుతో వచ్చే ఈ ఈ-స్కూటర్ రానున్న పండుగ సీజన్‌లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. బీఎండబ్ల్యూ మోటరాడ్ సీఈ 02 ప్రీ-లాంచ్ బుకింగ్ శనివారం ప్రారంభమవుతున్నాయి.
బీఎండబ్ల్యూ మోటరాడ్ సీఈ 02 ఈ-స్కూటర్‌ను స్థానికంగా భారత్‌లోనే అసెంబుల్ చేస్తారు. దీని ధర సుమారు రూ. 4.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో బీఎండబ్ల్యూ భారత్‌లో తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ సీఈ 04ని విడుదల చేసింది. దీని ధర 14.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 31 kW మోటార్‌ను పొందుతుంది మరియు 130 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.
బీఎండబ్ల్యూ సీఈ 02లో గరిష్టంగా 55 ఎన్‌ఎం శక్తిని ఉత్పత్తి చేసే 11 కిలోవాట్‌ల (15 హార్స్ పవర్) మోటర్ ఉంటుంది. దీని రేంజ్ 90 కి.మీ, గరిష్ట వేగం గంటకు 95 కి.మీ. సీటు ఎత్తు 750 మి.మీ. ఉంటుంది. ఇక టీనేజర్ల కోసం 4 కిలోవాట్‌ల వెర్షన్ కూడా ఉంటుంది. "ఫ్లో", "సర్ఫ్" అనే స్టాండర్డ్ రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. వీటితోపాటు "ఫ్లాష్" డ్రైవింగ్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment