విమానయాన సంస్థ ఎయిర్ కోస్టాకు కష్టాలు తీరేందుకు మరికొన్ని రోజులు పట్టేలా ఉంది. గత వారం నుంచి సంస్థ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విమానాలు మళ్లీ ఎప్పుడు ఎగిరేది అన్న విషయంలో ఇంకా సంధిగ్ధత నెలకొంది. ప్రస్తుతానికి ఎటువంటి బుకింగ్‌లను కంపెనీ స్వీకరించడం లేదు. కంపెనీ తన వెబ్‌సైట్ ద్వారా ఏప్రిల్ నెలకు కూడా బుకింగ్‌లను తీసుకోవట్లేదు. నిధుల లేమితో కంపెనీ సతమతమవుతోంది.