
కార్మికులపై కక్ష తగదు
హక్కుల కోసం పోరాడుతున్న కార్మిక వర్గంపై కక్ష సాధింపు చర్యలు విడనాడాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఒంగోలు టౌన్: హర్యానా రాష్ట్రంలోని మానెసార్‌లో మారుతీ సుజుకీ యాజమాన్యం హక్కుల కోసం పోరాడుతున్న కార్మిక వర్గంపై కక్ష సాధింపు చర్యలు విడనాడాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల జిల్లాశాఖల ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రెండువేల మంది కాంట్రాక్టు కార్మికులను చట్టవిరుద్ధంగా ఉద్యోగాలను తొలగించారని చెప్పారు. యాజమాన్యం చర్యలను నిరసిస్తూ పారిశ్రామిక కేంద్రాల వద్ద లక్ష మందితో భారీ ధర్నా నిర్వహించారన్నారు.
హర్యానా ప్రభుత్వ యాజమాన్యం, పోలీసులు కుమ్మక్కై కార్మిక వర్గంపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించా రు. ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌డీ సర్దార్, పీవీఆర్ చౌద రి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మజుం దార్, నగర కార్యదర్శి బి. వెంకట్రావు, ఐఎన్‌టీయూసీ నాయకులు కె. వీరాస్వామి, వీరాస్వామిరెడ్డి, ఐఎఫ్‌టీయూ నాయకులు మోహన్, మల్లికార్జున్, అనుబంధ విభాగాల నాయకులు కె. వెంకటేశ్వర్లు, పోలయ్య, వెంకట్రావు, ఎస్. కోటేశ్వరరావు, ఎన్. శ్రీనివాసరావు, సీహెచ్ వెంకటేశ్వర్లు, వెంకటేషన్, ఎస్‌కే మస్తాన్ ప్రసంగించారు.