
సాక్షి,ముంబై: దేశీయకార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఈ ఏడాది ఫలితాల్లో చతికిలబడింది. 2018-19 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను గురువారం విడుదల చేసింది. క్యూ2(జులై-సెప్టెంబర్)లో మారుతీ నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 2,240 కోట్లుగా నిలిచింది.
అయితే మొత్తం ఆదాయం 3 శాతం పెరిగి రూ. 22,433 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం 7శాతం తగ్గి రూ. 3,431 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు16.9శాతం నుంచి 15.3 శాతానికి బలహీనపడ్డాయి. వస్తువుల ధరల పెరుగుదల, ప్రతికూల విదేశీ మారకం, అమ్మకాల ప్రమోషన్ వ్యయాలు లాభాల క్షీణతకు కారణమని కంపెనీ పేర్కొంది. ఈ ఫలితాల నేపథ్యంలో స్వల్ప నష్టంతో ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment