సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయ వినియోగదారులకు షాకిచ్చిందింది. తన వాహనాల్లో కొన్ని మోడళ్ల కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. 'పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్' వేరియంట్‌ల కార్లలోని మోటారు జనరేటర్ యూనిట్లలో సమస్య కారణంగా వేలాది వాహనాలను రీకాల్ చేస్తోంది. 63,493 మారుతి సుజుకి సియాజ్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్ 6 కార్లును వెనక్కి తీసుకుంటోంది.
జనవరి1నవంబర్ 21మధ్య తయారైన సియాజ్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్ 6 మోడళ్ల స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్‌లను పరిశీలిస్తామని భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థమారుతి తెలిపింది. ఈ మేరకు మారుతి సుజుకి మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ సమాచారాన్ని అందించింది. విదేశీ గ్లోబల్ పార్ట్ సప్లయర్ తయారు చేయడం వలన ఎంజీయూలో లోపం ఏర్పడి వుండవచ్చని భావిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆయా వాహనదారులు ఈ రోజునుంచే మారుతి సుజుకి డీలర్లను సంప్రదించవచ్చని తెలిపింది. ఆయా వాహనాలను తనిఖీ చేయించు కోవడంతోపాటు లోపభూయిష్టమైన పార్ట్‌లను ఉచితంగా రీప్లేస్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా తమ రీకాల్‌కు సంబంధించిన ప్రచారాన్ని చేపట్టినట్టు మారుతి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment