ఏజీఎస్ కార్లకు డిమాండ్: మారుతీ సుజుకీ
హైదరాబాద్: ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆటో గేర్ షిఫ్ట్ (ఏజీఎస్) టెక్నాలజీతో తయారైన కార్లకు మంచి ప్రజా స్పందన వస్తోందని మారుతీ సుజుకీ పేర్కొంది. ఏజీఎస్ టెక్నాలజీని పొందుపరిచిన సెలెరియో, ఆల్టో కే10 కార్లతో సహా తాము ఇటీవల ఆవిష్కరించిన వ్యాగన్ ఆర్ కార్లకు డిమాండ్ బాగుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన ఆల్టో కే10, సెలెరియో కార్ల విక్రయాల్లో దాదాపు సగభాగం ఏజీఎస్ వేరియంట్లే ఉన్నాయని పేర్కొంది. దక్షిణాది నగరాల్లోని ప్రజలకు టెక్నాలజీ ట్రెండ్స్‌పై అవగాహన బాగా ఉంటుందని, అందుకే వారు ఆటోమెటిక్, ఏజీఎస్ ట్రాన్స్‌మిషన్ వంటి టెక్నాలజీతో కూడిన కార్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని మారుతీ సుజుకీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ వినయ్ పంత్ ఒక ప్రకటనలో తెలిపారు.