సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కారు తయారీదారి మారుతీ సుజుకి ఇండియా విక్రయాల్లో మరోసారి అదరగొట్టింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే, 14 శాతం వృద్ధిని నమోదుచేసింది. గతేడాది నవంబర్ నెలలో 1,35,550 యూనిట్లుగా ఉన్న మారుతీ సుజుకి విక్రయాలు, ఈ ఏడాది నవంబర్ నెలలో 1,54,600 యూనిట్లుగా రికార్డయ్యాయి. కంపెనీ దేశీయ విక్రయాలు కూడా 15 శాతం పెరిగి 1,45,300 యూనిట్లుగా నమోదుచేసింది మారుతీ సుజుకి. ఆల్టో, వాగన్‌ఆర్ వంటి మినీ సెగ్మెంట్ కార్ల విక్రయాలు మాత్రం స్వల్పంగా 1.8 శాతం మాత్రమే పెరిగాయి.
2016 నవంబర్‌లో 38,886 యూనిట్లుగా ఉన్న మినీ సెగ్మెంట్ కార్ల విక్రయాలు, ఈ ఏడాది నవంబర్ నాటికి 38,204 యూనిట్లుగా రికార్డయ్యాయి. స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఎస్టిలో వంటి మోడళ్ల కాంపాక్ట్ సెగ్మెంట్ విక్రయాలు భారీగా 32.4 శాతం పైకి జంప్ చేశాయని మారుతీ సుజుకీ తెలిపింది. మిడ్‌సైజ్ సెడాన్ సియాజ్ విక్రయాలు మాత్రమే 26.2 శాతం పడిపోయాయి. గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎస్-క్రాస్, కాంపాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రీజా వంటి యుటిలిటి వెహికిల్స్ విక్రయాలు కూడా పెరిగాయి. అటు ఎగుమతులు కూడా స్వల్పంగా పెరిగినట్టు మారుతీ సుజతుకి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment