
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ మార్కెట్లోకి సరికొత్త ఎర్టిగా కారును విడుదల చేసింది. 1.5 లీటర్ డీడీఐఎస్ 225 డీజిల్ ఇంజిన్‌తో అప్‌డేట్ చేసి లాంచ్ చేసింది. వీడీఐ, జెడ్‌డీఐ, జెడ్‌డీఐ ప్లస్ మూడు వేరియంట్లలో ఈ కారును విక్రయిస్తోంది. వీటి ప్రారంభ ధర (న్యూఢిల్లీ ఎక్స్‌షోరూమ్) రూ.9.86లక్షలు. అత్యధిక ధర రూ.11.20 లక్షలు.
పాత 1.3లీటర్ డీడీఐఎస్ 200 ఇంజిన్ స్థానంలో సరికొత్త 1.5 లీటర్ డీడీఐఎస్ 225 పెట్రోల్ ఇంజిన్ ను అమర్చింది. డ్యూయల్ మాస్ ఫ్లైవీల్ టెక్నాలజీ, 1498 సీసీ ఫోర్ సిలిండర్‌తో వస్తున్న ఈ కొత్త ఎర్టిగా 4000 ఆర్‌పీఎం వద్ద 94 బీహెచ్‌పీ శక్తి, 1500-2500 ఆర్‌పీఎం వద్ద 225ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. అవసరమైతే 1.5 లీటర్ డీజిల్ ఇంజీన్‌ను బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తామని మారుతీ ఛైర్మన్ ఆర్.సి.భార్గవ వెల్లడించారు.
కాగా ఎర్టిగా ఎంపీవీ సెగ్మెంట్లో అత్యధికంగా విక్రయించే వాహనంగా రికార్డు సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment