
సాక్షి, న్యూఢిల్లీ : ఆటో ఎక్స్‌పో 2020లో దేశీయ అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి తన హవాను చాటుకుంటోంది. నాలుగో తరం జపాన్ మోడల్ వాహనం సుజుకి జిమ్నీని శనివారం ప్రదర్శించింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 75 కిలోవాట్ / 6000 ఆర్‌పీఎం పవర్, 130 ఎన్‌ఎమ్ / 4000 ఆర్‌పిఎమ్ గరిష్ట టార్క్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.
భారతీయ వినియోగదారుల స్పందనను పరిశీలించేందుకు ఆటో ఎక్స్‌పో 2020లో ప్రదర్శనకు ఉంచామని మారుతి సీఎండీ కెనిచి అయుకావా వెల్లడించారు. కష్టతరమైన రోడ్లలో కూడా సులువుగా ప్రయాణించేలా దీన్ని రూపొందించినట్టు తెలిపారు. ప్రొఫెషనల్ వినియోగదారుల అంచనాలు, అవసరాలపై సమగ్ర పరిశోధనల ఆధారంగా జిమ్నీని అభివృద్ధి చేశామన్నారు. కాంపాక్ట్ డిజైన్, ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో సుజుకి జిమ్నీకి మంచి ఆదరణ లభిస్తోందని, 194 దేశాలలో విక్రయిస్తున్నా మన్నారు.
చదవండి : ప్రేమికులు మెచ్చే: ‘ట్విజీ’ బుల్లి కారు, ఆటో ఎక్స్‌పో: టాప్ ఎలక్ట్రిక్ వాహనాలు , కొత్త ఇంజీన్‌తో ఆకర్షణీయంగా మారుతి ఇగ్నిస్