![Former MD of Maruti Suzuki Jagdish Khattar dies due to cardiac arrest - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/26/Jagdish%20Khattar.jpg.webp?itok=ZVk5vU0Q)
సాక్షి,ముంబై: ఆటోమోటివ్ సేల్స్ అండ్ సర్వీస్ కంపెనీ కార్నోషన్ వ్యవస్థాపకుడు, మారుతి సుజుకి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖత్తర్ (78) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. 1993-2007 కాలంలోఖత్తర్ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఖత్తర్ పనిచేశారు. తరువాత 1999లో తొలుత ప్రభుత్వ నామినీగా, అనంతరం మే 2002 లో సుజుకి మోటార్ కార్పొరేషన్ నామినీ ఎండీ గా పనిచేశారు.ఖత్తర్ ఆటోమొబైల్ రంగంలో స్వతంత్ర మల్టీ-బ్రాండ్ పాన్ ఇండియా సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను కార్నేషన్ ఆటోను 2008 లో ప్రారంభించారు. దీనికి ముందు దాదాపు 37 సంవత్సరాల పాటు ఐఎఎస్ అధికారిగా పనిచేశారు. ఖత్తర్ మరణ వార్తను మారుతి సుజుకి చైర్మన్ ఆర్.సి.భార్గవ ధృవీకరించారు. ఆయన హఠాన్మరణంవ్యక్తిగతంగా తనకు తీరని నష్టమని వ్యాఖ్యానించారురు. ఖత్తర్ అకాలమరణంటో ఆటో పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
చదవండి: కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం
ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం.. కాంపౌండింగ్
Comments
Please login to add a commentAdd a comment