బెంగళూరు: ఇంధన రంగంలో ఉన్న ప్రభుత్వ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఈవీ బాట పట్టింది. దేశవ్యాప్తంగా 7,000 రిటైల్ ఔట్‌లెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
బెంగళూరు–చెన్నై, బెంగళూరు–మైసూరు–కూర్గ్ హైవే మార్గాల్లో ఈవీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను తాజాగా ప్రారంభించింది. వ్యూహాత్మక ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేసినట్టు సంస్థ ప్రకటించింది.
దేశంలోని ప్రధాన నగరాలు, ఆర్థిక కేంద్రాలను కలుపుతూ అన్ని ముఖ్య జాతీయ రహదారులపై నిర్ధేశిత దూరంలో రిటైల్ కేంద్రాల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలన్నది బీపీసీఎల్ ఆలోచన.
Comments
Please login to add a commentAdd a comment