ముంబై: ఏఎంఓ ఎలక్ట్రిక్ బైక్స్ కంపెనీ జాంటి ప్లస్ పేరుతో కొత్త స్కూటర్‌ను దేశీయ మార్కెట్లోని విడుదల చేసింది. దీని ధర ఎక్స్ షోరూం వద్ద రూ.1.10 లక్షలుగా ఉంది. కేవలం నాలుగు గంటల్లోనే 100 శాతం ఛార్జ్ అయ్యే 60 వోల్టుల లిథియం బ్యాటరీని ఇందులో అమర్చారు.
ఒకసారి పూర్తి చార్జింగ్‌తో ఈ స్కూటర్ 120 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. క్రూజ్ కంట్రోల్ స్విచ్, ఈఏబీఎస్, యాంటీ థెఫ్ట్ అలారమ్, సైడ్ స్టాండ్ సెన్సార్, సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డీఆర్‌ఎల్ లైట్స్, ఇంజిన్ కిల్ స్విచ్, రెండువైపులా టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెషన్, హై గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.
అలాగే పోర్టబుల్ బ్యాటరీ సదుపాయం కూడా ఉంది. ఫిబ్రవరి 15 నుంచి జాంటీ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు ప్రారంభం అవుతాయని ఏఎంవో ఎలక్ట్రిక్ బైక్స్ ఎండీ సుశాంత్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment