స్క్రాపేజ్‌లో పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సరికొత్త స్టార్టప్‌లు ఈ రంగంలో వెలుస్తాయని, ముఖ్యంగా దేశంలో ఉన్న మధ్యతరగతికి ఈ పాలసీ వల్ల మేలు జరుగుతుందన్నారు. గుజరాత్ పారిశశ్రామికవేత్తలతో జరిగిన వర్చువల్ సమావేశంలో స్క్రాప్ పాలసీకి సంబంధించిన విషయాలను ఆయన వెల్లడించారు.
- స్క్రాప్ పాలసీ ప్రకారం కమర్షియల్ వెహికల్స్‌కి 15 ఏళ్లు, ప్యాసింజర్ వెహికల్స్‌కి 20 ఏళ్లు దాటితే తుక్కుగా పరిగణిస్తారు. ఈ కాలపరిమితి దాటిన వాహనాల గుర్తింపు ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.
- 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాల( 4 వీల్ ఆపై)ను తుక్కుగా పరిగణిస్తారు
- ప్రభుత్వ గుర్తింపు పొందిన సెంటర్లలో వాహనాల ఫిట్‌నెస్ తనఖీ చేయించాలి. కాలపరిమితి తీరిన వాహనాలను తుక్కుగా ఎక్కడైనా అమ్మేయవచ్చు.
- తుక్కుకు నగదు చెల్లించడంతో పాటు తమ పాత వాహనాన్ని తుక్కు కింద అమ్మేసినట్టు చూపిస్తే కొత్త వాహనం కొనుగోలులో 6 శాతం వరకు తగ్గింపు వర్తిస్తుంది.
- తక్కుగా అమ్మినట్టు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లో 5 శాతం రాయితీ లభిస్తుంది
స్టార్టప్‌లు రావాలి
కాలుష్యాన్ని తగ్గించే పనిలో భాగంగా కాలపరిమితి నిండిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు తెచ్చిన కొత్త పాలసీలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని మోదీ అన్నారు. ఇకపై నిరుపయోగంగా ఉన్న వాహనాల్ని దశల వారీగా తగ్గించాలన్నారు. ఈ పని చేసేందుకు స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయాంటూ యువతను ఆయన ఆహ్వానించారు. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ మధ్య తరగతి కుటుంబాలకు అండగా నిలుస్తుందని మోదీ అన్నారు. తుక్కు తనిఖీ కేంద్రాల ఏర్పాటు, రీసైక్లింగ్ తదితర విభాగాల్లో కొత్తగా 50 వేల వరకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ప్రధాని అన్నారు. అనంతరం కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. స్క్రాపేజ్ పాలసీ వల్ల రా మెటిరియల్ కాస్ట్ 40శాతం తగ్గుతుందని, దీనివల్ల ఇండియా ఆటోమోబైల్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ సెక్టార్‌కి మనదేశం ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతుందన్నారు.
వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ప్రారంభం
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఆర్ధిక ప్రయోజనాలతో పాటు ఉపాధి కల్పన దిశగా వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ప్రతిపాదించారు.ఈ పాలసీ వల్ల దేశంలో నిరుపయోగంలో ఉన్న వాహనాలు తుక్కుగా మారిపోన్నాయి. దేశంలో ప్రస్తుతం ఉన్న 20 ఏళ్లు దాటిన 51 లక్షల వాహనాలు, 15 ఏళ్లు దాటిన 34 లక్షల వాహనాలు తుక్కుగా మారుతాయి. దీని వల్ల 25 శాతం వాహన కాలుష్యం తగ్గుతుంది. స్క్రాప్ చేసిన వాహనాలు రీసైకిల్ చేసిన తరువాత ముడి పదార్థాలను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి : ఇకపై ఎంచక్కా..ఫ్లైట్ జర్నీలోనే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు
Comments
Please login to add a commentAdd a comment