Vehicle act
-
హెల్మెట్ ధరించకపోతే ఉపేక్షించొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించరాదని స్పష్టం చేసింది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల సంభవిస్తున్న మరణాలను దృష్టిలో పెట్టుకుని ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. ఈ విషయంలో చట్ట నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంది. తదుపరి విచారణను ఆగస్టు 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అవగాహన కల్పించండి హెల్మెట్ ధరించాల్సిన అవసరం, ధరించకుండా సంభవించే దు్రష్పభావాలపై వాహన చోదకులలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులను, న్యాయ సేవాధికార సంస్థను ధర్మాసనం ఆదేశించింది. చట్ట నిబంధనల గురించి ప్రాంతీయ, జాతీయ భాషా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలంది. రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు తప్పనిసరిగా బాడీఓర్న్ కెమెరాలు ధరించాల్సిన అవసరం ఉందంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలంది. తద్వారా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలను కోర్టు ముందుంచి వారికి శిక్ష పడేలా చేయొచ్చని తెలిపింది. అలాగే మోటారు వాహన చట్టంలో నిర్ధేశించిన ఇతర నిబంధనలను కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఈ వ్యవహారం విస్తృత ప్రజా ప్రయోజనాలకు సంబంధించిందని, దీనిని సీరియస్‌గా తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు స్పష్టం చేసింది. అందువల్ల సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారికి విధించిన చలాన్ల వివరాలను, వాహన తనిఖీల వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. మంచి వ్యాజ్యం దాఖలు చేశారంటూ పిటిషనర్ తాండవ యోగేషన్ను ధర్మాసనం ఈ సందర్భంగా అభినందించింది.2022లో 3,042 మంది మృతి కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేయడం లేదని, చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానాలు విధించడం లేదని, దీంతో పెద్ద సంఖ్యలో వాహన ప్రమాదాలు, మరణాలు చోటు చేసుకుంటున్నాయని న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ట్రాఫిక్‌తో సహా మోటారు వాహన చట్ట నిబంధనల కింద ఇతర విధులు నిర్వర్తించే పోలీసులు, ఇతర అధికారులు బాడీఓర్న్ కెమెరాలను ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. యోగేష్ వాదనలు వినిపిస్తూ.. 2022లో రోడ్డు ప్రమాదాల కారణంగా 3,703 మరణాలు సంభవించాయని, ఇందులో 3,042 మరణాలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే సంభవించాయని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. విజయవాడలో హెల్మెట్ లేకుండా వాహన చోదకులు తిరుగుతుండటాన్ని తాము కూడా గమనించామంది. చట్ట నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సి ఉందని, ఈ దిశగా తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. దీనికి ముందు చట్ట నిబంధనల అమలుకు ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
9 లక్షల వాహనాలు తుక్కుకే: నితిన్ గడ్కరీ
కాలం చెల్లిన వాహనాలను వదిలించుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి ఆ వాహనాలు రోడ్లపై తిరగకుండా అనుమతుల్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ ఘడ్కరీ అధికారిక ప్రకటన చేశారు. పరిశ్రమల సంస్థ ఫిక్కీ (fcci) నిర్వహించిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ..పర్యావరణానికి హానికలిగించే వాహనాల్ని స్క్రాప్‌గా మార్చనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్టీసీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో 15 ఏళ్లు దాటిన 9 లక్షలకు పైగా కార్లు, బస్సులు తదితర వాహనాలను ఏప్రిల్ 1 నుంచి రోడ్డెక్కబోవు. రిజిస్ట్రేషన్ రద్దు చేసి వాటన్నింటినీ తుక్కు కింద మార్చేస్తామని అన్నారు. వాటిని పర్యావరణహిత ప్రత్యామ్నాయ ఇంధనాలతో కూడిన కొత్త వాహనాలను భర్తీ చేస్తామన్నారు. అయితే రక్షణ, సైనిక వాహనాలు, ప్రత్యేక వాహనాలు తదితరాలకు ఇది వర్తించబోదన్నారు. -
ఉద్యోగులకు బంపర్ ఆఫర్..! ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుపై..
ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సందడి చేస్తున్నాయి. పెట్రో ధరలు పెరిగిపోతుండడం, పెట్రో వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలపై అప్‌గ్రేడ్ అవ్వడంతో ఈవీ వెహికల్స్ సత్తా చాటుతున్నాయి. ఇటీవల జస్ట్ డయల్ కన్స్యూమర్ ఇన్సైట్ నిర్వహించిన సర్వే సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఎలక్ట్రానిక్ స్కూటర్లు అత్యధికంగా 220.7 శాతం మేర డిమాండ్‌ను సాధించగా, ఎలక్ట్రిక్ కార్లు 132.4 శాతం, ఎలక్ట్రానిక్ బైక్స్ 115.3 శాతం, ఎలక్ట్రానిక్ సైకిళ్లు 66.8 శాతం డిమాండ్ పెరిగినట్లు జస్ట్ డయల్ తన నివేదికలో పేర్కొంది. అయితే భారత్‌లో ఈవీ వెహికల్స్ కొనుగోలు చేస్తే ఆర్ధికంగా కాకుండా, ట్యాక్స్ పరంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈవీ వెహికల్స్‌తో ట్యాక్స్ బెన్పిట్స్ ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం వ్యక్తిగత ఉపయోగం కోసం కొనుగోలు చేసిన కార్లు లగ్జరీ ఉత్పత్తులుగా పరిగణించబడతాయి. కాబట్టి వినియోగదారులు కారు రుణాలపై ఎలాంటి పన్ను ప్రయోజనాలను పొందలేరు. కానీ ఈవీ వెహికల్స్ విషయంలో అందుకు భిన్నంగా ఉంది. మనదేశంలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఈవీ వెహికల్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా సెక్షన్ 80EEB ప్రకారం..ఉద్యోగస్తులు రుణంపై ఈవీ కారును కొనుగోలు చేస్తే.. తీసుకున్న లోన్ పై చెల్లించే వడ్డీలో రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈవీ వెహికల్స్ రుణాలపై పన్ను మినహాయింపులు ►సెక్షన్ 80EEB కింద ఎలక్ట్రికల్ వెహికల్ లోన్ చెల్లించే సమయంలో రూ. 1,50,000 వరకు మొత్తం పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పన్ను మినహాయింపు ఫోర్ వీలర్, టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ► సెక్షన్ 80EEB క్రింది షరతులకు లోబడి ఉంటుంది. ఈ మినహాయింపును ఎవరైనా ఒక్కసారి మాత్రమే పొందవచ్చు. అంటే ఇప్పటికే ఈవీ వెహికల్ ఉండి, మళ్లీ ఈవీ వెహికల్‌ను కొనుగోలు చేసే వారిని అనర్హులుగా భావిస్తారు. ►ఈ మినహాయింపు రుణంపై ఈవీని కొనుగోలు చేసే వ్యక్తులకు మాత్రమే. ఈవీకి రుణ ఫైనాన్సింగ్ ఆర్థిక సంస్థలు లేదా ఎన్‌ఎఫ్‌బీసీల నుండి పొందవచ్చు. ►ఈవీ పన్ను మినహాయింపు వ్యాపారాలకు కాదు. వ్యక్తులు మాత్రమే పొందగలరు. ► ఏప్రిల్ 1, 2019 నుండి మార్చి 31, 2023 మధ్య కాలంలో తీసుకున్న అన్ని ఈవీ లోన్ చెల్లింపుల కోసం సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80EEB కింద పన్ను ప్రయోజనాలను ఫైనాన్షియల్ ఇయర్ 2020-2021 నుండి పొందవచ్చు. చదవండి : ఎలక్ట్రిక్ వాహనాలపై క్రేజ్ మరీ ఇంతగా ఉందా...! -
‘స్క్రాపేజ్ పాలసీతో అదనంగా రూ.40వేల కోట్లు’
న్యూఢిల్లీ: వాహనాల తుక్కు విధానం (స్క్రాపేజీ పాలసీ) దేశ ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు ఊతమిస్తుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాహనాల స్క్రాపేజీ పాలసీని ఆవిష్కరించడం కేంద్రం, రాష్ట్రాలకు సైతం అనుకూలిస్తుందంటూ.. జీఎస్టీ రూపంలో రూ.40వేల కోట్లను అదనంగా పొందొచ్చన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే వాహన స్క్రాపేజీ విధానాన్ని ఆవిష్కరించడం తెలిసిందే. -
స్క్రాపేజీ విధానంతో వాహనాల ధరలు తగ్గనున్నాయా...!
న్యూఢిల్లీ: వాహనాల స్క్రాపేజీ విధానంతో కొత్త వ్యాపార మోడల్స్ రాగలవని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. చిన్న, మధ్య తరహా సంస్థలు.. వాహనాల టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి అవకాశాలు లభించగలవని పేర్కొన్నారు. నమోదిత వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాల (ఆర్వీఎస్ఎఫ్) ఏర్పాటు కోసం పెట్టుబడులు వస్తాయని, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియా పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు సుమారు 50–60 దాకా రావచ్చని తెలిపింది. ఆటోమోటివ్ల తయారీ సంస్థలు.. రీసైక్లింగ్ పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు తేగలవని ఈవై ఇండియా పేర్కొంది. రీసైకిల్ చేసిన ఉత్పత్తుల కారణంగా ముడి వస్తువుల ధరలు, తత్ఫలితంగా వాహనాల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని వివరించింది. కోవిడ్–19 పరిస్థితులు.. ప్రస్తుత సరఫరా వ్యవస్థలోని బలహీనతలను గురించి పరిశ్రమకు తెలియజెప్పాయని ఈవై ఇండియా తెలిపింది. స్క్రాపేజీ విధానం వల్ల కాలుష్యం, ఇంధన దిగుమతుల బిల్లుల భారం వంటివి తగ్గడం.. విడిభాగాల పునర్వినియోగంవంటి సానుకూల పరిణామాలు ఉండగలవని వివరించింది. వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తులు, సర్వీసులు అందించే దిశగా సంప్రదాయ ఆటోమోటివ్ వ్యవస్థలో భాగమైన సంస్థలు, కొత్త సంస్థలు సంఘటితంగా కలిసి పనిచేయడానికి ఆస్కారం ఉందని తెలిపింది. -
తుక్కుకు ఓ లెక్కుంది... ప్రభుత్వ కొత్త పాలసీ ఇదే
స్క్రాపేజ్లో పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సరికొత్త స్టార్టప్‌లు ఈ రంగంలో వెలుస్తాయని, ముఖ్యంగా దేశంలో ఉన్న మధ్యతరగతికి ఈ పాలసీ వల్ల మేలు జరుగుతుందన్నారు. గుజరాత్ పారిశశ్రామికవేత్తలతో జరిగిన వర్చువల్ సమావేశంలో స్క్రాప్ పాలసీకి సంబంధించిన విషయాలను ఆయన వెల్లడించారు. - స్క్రాప్ పాలసీ ప్రకారం కమర్షియల్ వెహికల్స్‌కి 15 ఏళ్లు, ప్యాసింజర్ వెహికల్స్‌కి 20 ఏళ్లు దాటితే తుక్కుగా పరిగణిస్తారు. ఈ కాలపరిమితి దాటిన వాహనాల గుర్తింపు ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. - 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాల( 4 వీల్ ఆపై)ను తుక్కుగా పరిగణిస్తారు - ప్రభుత్వ గుర్తింపు పొందిన సెంటర్లలో వాహనాల ఫిట్నెస్ తనఖీ చేయించాలి. కాలపరిమితి తీరిన వాహనాలను తుక్కుగా ఎక్కడైనా అమ్మేయవచ్చు. - తుక్కుకు నగదు చెల్లించడంతో పాటు తమ పాత వాహనాన్ని తుక్కు కింద అమ్మేసినట్టు చూపిస్తే కొత్త వాహనం కొనుగోలులో 6 శాతం వరకు తగ్గింపు వర్తిస్తుంది. - తక్కుగా అమ్మినట్టు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లో 5 శాతం రాయితీ లభిస్తుంది స్టార్టప్‌లు రావాలి కాలుష్యాన్ని తగ్గించే పనిలో భాగంగా కాలపరిమితి నిండిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు తెచ్చిన కొత్త పాలసీలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని మోదీ అన్నారు. ఇకపై నిరుపయోగంగా ఉన్న వాహనాల్ని దశల వారీగా తగ్గించాలన్నారు. ఈ పని చేసేందుకు స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయాంటూ యువతను ఆయన ఆహ్వానించారు. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ మధ్య తరగతి కుటుంబాలకు అండగా నిలుస్తుందని మోదీ అన్నారు. తుక్కు తనిఖీ కేంద్రాల ఏర్పాటు, రీసైక్లింగ్ తదితర విభాగాల్లో కొత్తగా 50 వేల వరకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ప్రధాని అన్నారు. అనంతరం కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. స్క్రాపేజ్ పాలసీ వల్ల రా మెటిరియల్ కాస్ట్ 40శాతం తగ్గుతుందని, దీనివల్ల ఇండియా ఆటోమోబైల్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ సెక్టార్‌కి మనదేశం ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతుందన్నారు. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ప్రారంభం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఆర్ధిక ప్రయోజనాలతో పాటు ఉపాధి కల్పన దిశగా వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ప్రతిపాదించారు.ఈ పాలసీ వల్ల దేశంలో నిరుపయోగంలో ఉన్న వాహనాలు తుక్కుగా మారిపోన్నాయి. దేశంలో ప్రస్తుతం ఉన్న 20 ఏళ్లు దాటిన 51 లక్షల వాహనాలు, 15 ఏళ్లు దాటిన 34 లక్షల వాహనాలు తుక్కుగా మారుతాయి. దీని వల్ల 25 శాతం వాహన కాలుష్యం తగ్గుతుంది. స్క్రాప్ చేసిన వాహనాలు రీసైకిల్ చేసిన తరువాత ముడి పదార్థాలను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి : ఇకపై ఎంచక్కా..ఫ్లైట్ జర్నీలోనే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు -
వాహనదారులకు అదిరిపోయే శుభవార్త!
న్యూఢిల్లీ: మీకు దగ్గర ఏదైనా వాహనం ఉందా? లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే, మీకు శుభవార్త. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటారు వాహన 1989 చట్టంలోని కొన్ని నిబంధనలలో మార్పులు చేసింది. ఈ కొత్త నిబందనల ప్రకారం.. వాహన యజమాని వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో తన వాహనానికి నామినీ పేరును కూడా జత చేయవచ్చు. ప్రస్తుతం ఎలాగైతే బ్యాంక్ ఖాతా, భీమా వంటి ఖాతాలకు నామినీని పెట్టుకున్నామో అలాగా అన్నమాట. వాహన యజమాని మరణించినప్పుడు ఆ వాహనాన్ని తన పేరు మీద మార్చుకోవడానికి ఈ మార్పుల వల్ల సులభతరం కానుంది. నామినీ పేరును వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో లేదా తర్వాత అయిన ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా జత చేయవచ్చు. ఇప్పటి వరకు నామినీని జాతచేయడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉండే విదంగా కొత్త నిబందనలు తీసుకువచ్చింది. నామినీ పేరును జత చేయాలంటే అతని గుర్తింపు కార్డు తప్పనిసరిగా సమర్పించాలి. వాహన యజమాని మరణించిన తర్వాత ఆ వాహనాన్ని తన పేరుమీదకు మార్చాలంటే 30 రోజుల్లోపు యజమాని మరణాన్ని రిజిస్ట్రేషన్ అథారిటీకి తెలపాల్సి ఉంటుంది. అలాగే, వాహన యజమాని మరణించిన 3 నెలల్లో నామినీ వాహన బదిలీ కోసం ఫారం-31 ను సమర్పించాలి. పెళ్లి విడాకులు, ఆస్తి విభజన వంటి సందర్భాల్లో నామినీలో పేరు మార్పు కోసం యజమాని అంగీకరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP)తో మార్చవచ్చు. ప్రస్తుతం ఒక వాహనం రిజిస్టర్డ్ యజమాని మరణించిన సందర్భంలో వాహనాన్ని నామినీకి బదిలీ చేయడానికి వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాలి. రాష్ట్రం రాష్ట్రానికీ ఈ విధానం మారుతూ ఉంటుంది. యజమాని మరణించిన సందర్భంలో వాహన బదిలీకి చట్టపరమైన వారసుడిగా గుర్తింపు రుజువు చూపించాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పౌరుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు నవంబర్ 27న, 2020 రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లో నామినీ పేరు వాహనం యజమాని జత చేయడానికి సెంట్రల్ మోటార్ వాహనాలు 1989 చట్టంలో మార్పులు చేయాలని మొదట ప్రతిపాదించింది. తర్వాత అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అలాగే, సాధారణ ప్రజల నుండి సలహాలు కోరింది. అన్నీ సూచనలను పరిశీలించిన తరువాత, మంత్రిత్వ శాఖ తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. చదవండి: కరోనాతో చనిపోతే రూ.2లక్షలు వస్తాయా? -
హెల్మెట్ లేకుంటే 3 నెలలు లైసెన్స్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు పూర్తి స్థాయిలో నియంత్రించడంపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ద్విచక్ర వాహన చోదకులతో పాటు వెనకాల కూర్చునే వారికి హెల్మెట్ లేకుంటే ఈ–చలాన్లు జారీ చేస్తున్న పోలీసులు.. ఇకపై మరిన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మోటార్ వెహికల్ చట్టం– 2019 ప్రకారం హెల్మెట్ లేకుంటే రూ.వెయ్యి జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయొచ్చన్న అంశాలు వాహన దారులకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ‘ఇప్పటివరకు జరుగుతున్న చాలా వరకు రోడ్డు ప్రమాదాల సమయంలో వాహన చోదకులకు హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో హెల్మెట్ ధరించని వారికి జరిమానాతో పాటు 3 నెలల డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదించింది. ఇదే విషయాన్ని వాహనచోదకులకు అవగాహన కలిగించే దిశగా కార్యక్రమాలు చేపడతాం. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అదేశాను సారం చర్యలు తీసుకుంటాం’అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు
-
సరిహద్దుల నుంచి ఏపీ ఆర్టీసీ బస్సులు
సాక్షి, హైదరాబాద్\అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం చేసిన చట్టాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేస్తున్నామని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యల విషయంలో నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ‘సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉంటూనే వాహనాలకు అనుమతి. ప్రభుత్వ నిర్ణయాలు పట్ల వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు. అడ్డగోలుగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తప్పవు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నార’ని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రహదారుల మరమ్మతుల కోసం సీఎం వైఎస్ జగన్ రూ.2500కోట్లు మంజూరు చేశారని చెప్పారు. వాహనదారులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. చదవండి: ఏపీఎస్ ఆర్టీసీ క్లారిటీ : ప్రతిష్టంభన వీడినట్లేనా! సరిహద్దుల వద్ద ఏపీ ఆర్టీసీ బస్సులు ఏపీ-తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీ ఆర్టీసీ బస్సులు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద బస్సులు అందుబాటులో ఉంచామని మంత్రి పేర్ని నాని తెలిపారు. పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్టల వద్ద ఏపీ బస్సులు ఉంటాయని చెప్పారు. సరిహద్దుల నుంచి ఊళ్లకు చేరేందుకు బస్సులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జూన్ 18 నుంచి టీఎస్ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నామని చెప్పారు. తెలంగాణ-ఏపీ మధ్య బస్సులు నడిపేందుకు కృషి చేశామని తెలిపారు. టీఎస్ ఆర్టీసీ కార్యాలయానికి సెలవులు కావడంతో నిర్ణయంలో జాప్యం అయిందని అన్నారు. టీఎస్ ఆర్టీసీతో పూర్తి స్థాయి చర్చలు అనంతరం బస్సులు నడుపుతాంమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ లాభనష్టాలు చూడట్లేదు, ప్రజలు ఇబ్బంది పడకూడదనే తమ ఉద్దేశమని తెలిపారు. -
లారీలకు బ్రేక్‌లు
లారీ పరిశ్రమకు అటు విజయవాడ తరువాతి స్థానం సాలూరుదే. పట్టణంలో అడుగడుగునా లారీలు... వాటిపై ఆధారపడిన ఎన్నో గ్యారేజీలు... మరిన్ని మెకానిక్ షెడ్లు... మనకు దర్శనమిస్తాయి. అంటే ఈ పరిశ్రమ ఎంతోమందికి భుక్తి కలిగిస్తోందన్నమాట. ఇప్పటికే పెరిగిన డీజిల్‌ధరలు... జీఎస్టీలు... పెరిగిపోతున్న ముడిసరకుల ధరలతో పరిశ్రమ కాస్తా కుంటుపడింది. ఒకప్పుడు దర్జాగా బతికిన యజమానులు కాస్తా నష్టాలతో కష్టాలపాలయ్యారు. అయినా ఇంకా కొందరు దానిపైనే ఆధారపడి కాలం నెట్టుకొస్తున్నారు. తద్వారా కొందరు బడుగులకు జీవన భృతి కలుగుతోంది. కానీ తాజాగా వచ్చిన కొత్త వాహన చట్టం ఆ పరిశ్రమను మరింత నష్టాల్లోకి నెట్టేస్తోంది. భారీ జరిమానాలతో నడపలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాలూరు ప్రాంతం లారీలకు ప్రసిద్ధి.. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు వందలాది లారీలు సరుకు రవాణా చేస్తుంటాయి. వేలాది మంది ఇక్కడి లారీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన మోటారు వెహికల్ చట్టంలోని నిబంధనల పుణ్యమాని నష్టాలు చవిచూస్తున్నారు. దీనికి నిరసనగా గురువారం దేశ వ్యాప్తం గా జరుగుతున్న లారీల బంద్‌లో పాలు పంచుకుం టున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ తరు వాత లారీలు అధికంగా సాలూరులోనే ఉన్నాయి. ఇక్కడ సుమారు 2500 లారీలుండగా వీటిలో సుమా రు 1500 లారీలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలకే గాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు సరుకులను నిత్యం రవాణా చేస్తున్నాయి. ఈ లారీలను నడుపుతున్న డ్రైవర్లు, క్లీనర్లు, యజమానులు ఒక్క సాలూరు పట్టణంలోనే సుమా రు 10 వేలకుపైగా ఉన్నారు. దీనిపైనే ఆ కుటుంబా లు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరితో పాటు గ్రీజ్బాయ్లు, మెకానిక్‌లు తదితర మొత్తం 15 వేలకు పైగా కుటుంబాలు సైతం వీటి ఆధారంగానే జీవిస్తున్నాయి. ఇక్కడి లారీలనే ఇతర రాష్ట్రాల్లో అవసరాలకు కాంట్రాక్టర్లు, వినియోగదారులు తీసుకువెళుతుంటారు. ఈ లారీల ద్వారా బొగ్గు, బాయిల్డ్ రైస్, ఇనుము, మట్టి రవాణా అధికంగా ఉంటుంది. విశాఖపట్నంలోని గన్నవరం పోర్టు నుండి బొగ్గు రవాణా అధికంగా జరుగుతుంది. ఒక లారీ ఒక రోజు ఆగితే సుమారు రూ.6 వేల వరకు నష్టం ఉంటుందని లారీ యజమానులు చెబుతున్నారు. ఒక రోజు లారీ లు బంద్‌లోకి వెళితే సాలూరు పట్టణంలో అన్ని లారీలకు కలిపి సుమారు రూ.కోటికిపైగా నష్టం వాటిల్లుతుందంటున్నారు. వేధిస్తున్న కొత్త నిబంధనలు... కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మోటారు వెహికల్ చట్టం వల్ల అధికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని లారీ యజమానులు ఆందోళన బాట పట్టారు. ఈ లారీలు ఒడిశా, చత్తీస్‌గఢ్‌లకు వెళ్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో చిన్న చిన్న ఉల్లంఘనలకు కూడా కొత్త చట్టం ప్రకారం భారీగా జరిమానాలు విధిస్తుండటంతో లారీ యజమానులకు రానూపోనూ కిరాయి డబ్బులు ట్రాఫిక్ జరిమానాలకే సరిపోవడం లేదు. బీమా ప్రీమియం, జీఎస్టీలు వంటివి యజమానులకు ఇబ్బందులు కలుగజేస్తున్నాయనేది వారి వాదన. మోటారు వాహన చట్టంలో సవరణలు చేసి లారీలపై జరిమానాలు తగ్గించాలని, జీఎస్టీ మినహాయించాలనేది వారి ప్రధాన డిమాండ్. దానికోసం ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్ల అసోసియేషన్ మద్దతు తెలిపింది. ఫలితంగా జిల్లా నుంచి ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు వెళ్లే లారీలన్నీ సాలూరులోనే నిలిచిపోనున్నాయి. బుధవారమే కొన్ని లారీలు నిలిచిపోయాయి. సాలూరు శివారులో రోడ్డు పక్కన, పట్టణ లారీ అసోసియేషన్ కార్యాలయ ఆవరణలో భారీగా లారీలు నిలిచాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు.. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు పడుతున్నాం. లారీలు నడపడం కష్టం గా మారింది. ట్రాఫిక్ చట్టాల పేరుతో భారీగా జ రిమానాలు వేస్తున్నారు. ఇలా అయితే మరీ నష్టాల్లో కూరుకుపోతాం. ఇంతకుముందు రూ.500 లోపు జరిమానాలు ఉండగా ఇప్పుడు రూ.2500 కు తక్కువ కాకుండా ఫైన్లు వేస్తున్నారు. – అక్కేన అప్పారావు, లారీ యజమాని, సాలూరు లారీ పరిశ్రమకు సడలింపునివ్వాలి.. కేంద్ర ప్రభుత్వం లారీ పరి శ్రమలకు కొన్ని సడలింపులివ్వాలి. లారీ లపై జరిమానాలు విధింపు తగ్గించాలి. జీఎస్టీ మినహాయింపులు ప్రకటించాలి. లేక పోతే అంతంత మాత్రంగా సాగుతున్న ఈ పరిశ్రమ మరింత కునారిల్లక తప్పదు. – కర్రి మహేష్, సాలూరు లారీ ఓనర్ల సంఘం మాజీ జాయింట్ సెక్రటరీ, లారీ యజమాని -
‘ట్రాఫిక్’ ఆదాయం అక్షరాలా వందకోట్లు!
సాక్షి, హైదరాబాద్: మోటారు వాహన చట్ట నిబంధనలు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 2015 సంవత్సరానికి వాహనదారుల నుంచి జరిమానా కింద తెలంగాణ పోలీసులు ఎంత మొత్తం వసూలు చేశారో తెలుసా.. అక్షరాల రూ.100 కోట్ల 90లక్షలు. ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు నమోదు చేసిన కేసులు 56, 25, 277. ఇక 2016 సంవత్సరానికి ఈ మొత్తం కనీసంగా రూ.150 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఏడాది మే 31వ తేదీ నాటికే పోలీసులు దాదాపు రూ.69 కోట్లు జరిమానా కింద వసూలు చేశారు. ఇందులో భాగంగా 38,31,896 కేసులు నమోదు చేశారు. 2015 సంవత్సరంలో తాగి వాహనం నడిపినందుకు మోటారు వాహన చట్టం 1988 కింద 55,545 మందిపై కేసు నమోదు చేయగా, అందులో 43,964 మందిని కోర్టులో ప్రాసిక్యూట్ చేశారు. ఇందులో 5424 మందికి కోర్టు శిక్ష విధించింది. ఇక 2016 విషయానికి వస్తే ఫిబ్రవరి 29వ తేదీ వరకు 9916 మందిని ప్రాసిక్యూట్ చేశారు.