సాక్షి, హైదరాబాద్: మోటారు వాహన చట్ట నిబంధనలు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 2015 సంవత్సరానికి వాహనదారుల నుంచి జరిమానా కింద తెలంగాణ పోలీసులు ఎంత మొత్తం వసూలు చేశారో తెలుసా.. అక్షరాల రూ.100 కోట్ల 90లక్షలు. ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు నమోదు చేసిన కేసులు 56, 25, 277. ఇక 2016 సంవత్సరానికి ఈ మొత్తం కనీసంగా రూ.150 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఏడాది మే 31వ తేదీ నాటికే పోలీసులు దాదాపు రూ.69 కోట్లు జరిమానా కింద వసూలు చేశారు.
ఇందులో భాగంగా 38,31,896 కేసులు నమోదు చేశారు. 2015 సంవత్సరంలో తాగి వాహనం నడిపినందుకు మోటారు వాహన చట్టం 1988 కింద 55,545 మందిపై కేసు నమోదు చేయగా, అందులో 43,964 మందిని కోర్టులో ప్రాసిక్యూట్ చేశారు. ఇందులో 5424 మందికి కోర్టు శిక్ష విధించింది. ఇక 2016 విషయానికి వస్తే ఫిబ్రవరి 29వ తేదీ వరకు 9916 మందిని ప్రాసిక్యూట్ చేశారు.
‘ట్రాఫిక్’ ఆదాయం అక్షరాలా వందకోట్లు!
Published Thu, Jul 7 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM
Advertisement