
సాక్షి,ముంబై : ఆటో దిగ్గజం బజాజ్ ఆటో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం ప్రకటించిన క్యూ1 ఫలితాల్లో 1012 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. గత ఏడాదితో పోలిస్తే 2.84 శాతం క్షీణించినప్పటికీ ఆదాయంలో వృద్ధిని సాదించింది. వార్షిక ప్రాతిపదికన 3.90 శాతం ఎగిసి, రూ.7785 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. దీంతో బజాజ్‌ఆటో షేరు 6 శాతం పుంజుకుంది.
మొదటి త్రైమాసికంలో 1,247,174 యూనిట్లను విక్రయించినట్లు బజాజ్ ఆటో తెలిపింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 1,226,641 యూనిట్లతో పోలిస్తే అమ‍్మకాలు 2 శాతం పెరిగాయి.