సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టూ వీలర్ల తయారీ దిగ్గజం బజాజ్ ఆటో మరో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. ఎన్‌ఎస్ సిరీస్‌లో కొత్త వెర్షన్‌గా బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 బైక్‌ను గురువారం విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ ధరను రూ. 1.09 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది. 200సీసీ ఇంజీన్ తో దీన్ని వినూత్నంగా రూపొందించింది.
ఏబీస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్‌తో అప్ గ్రేడ్ చేసి, 200 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజీన్‌తో ఈ బైక్‌ను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏబీస్‌పై తమకు చాలా అభ్యర్థనలు వచ్చాయని..అందుకే అప్‌గ్రేడ్ వెర్షన్‌గా బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 200 లాంచ్ చేశామని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (మోటారుసైకిల్స్) ఎరిక్ వాస్ తెలిపారు.
ఈ ఏబీఎస్ వేరియంట్ బైక్ పనితీరును మెరుగుపరుస్తుందనీ, అలాగే పెర్‌ఫామెన్స్ సెగ్మెంట్‌లో తమ లీడర్ షిప్ మరింత బలపడుతుందన్ని విశ్వాసాన్నివ్యక్తంచేశారు. తమ జాగా బైక్ అన్ని మెట్రో నగరాల్లో ప్రస్తుతం కొత్త వేరియంట్ ప్రవేశపెడుతున్నామనీ, అనంతరం దేశంలో అన్ని డీలర్షిప్ల ద్వారా క్రమక్రమంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment