Pulsar models
-
ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ150: ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: బజాజ్ కంపెనీ దేశీయ మర్కెట్లో సరి కొత్త పల్సర్ స్పోర్ట్స్ బైక్‌ను లాంచ్ చేసింది. యూత్ క్రేజ్‌కు అనుగుణంగా కొత్తగా అప్డేట్ చేసి స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ150 బైక్‌ను ఆవిష్కరించింది. రేసింగ్ రెడ్, ఎబోనీ బ్లాక్ బ్లూ, ఎబోనీ బ్లాక్ వైట్, ఎబోనీ బ్లాక్ రెడ్, కరేబియన్ బ్లూ అనే 5 రంగుల్లో ఈబైక్ అందుబాటులోకి వచ్చింది. ధర: సింగిల్-డిస్క్, సింగిల్ సీట్ కలిగిన బైక్ ధర రూ.1.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) అలాగే ట్విన్-డిస్క్, స్లిట్ సీట్ మోడల్ ధరను రూ.1,19,757 ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది కంపెనీ. ఇంజీన్, ఫీచర్లు 149 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ 8500 ఆర్పీఎమ్ వదర్ద 14.5 హెచ్‌పీని, 13.5Nm టార్క్‌ను విడుదల చేస్తుంది ఈ బైకులో యూఎస్బీ మొబైల్ చార్జింగ్ పోర్ట్, గేర్ ఇండికేటర్, సింగిల్ చానల్ ఏబీఎస్ బ్రేకింగ్ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లను తోపాటు,స్ప్లిట్ గ్రాబ్ రైల్, క్లిప్-ఆన్ బార్లు చ స్ప్లిట్ సీట్ సెటప్ డ్యూయల్-డిస్క్ వెర్షన్‌తో డిజైన్ మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దింది. వెనకాల సీట్ కాస్త హైట్ ఇచ్చి . LED DRLలు , LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. ఇక పోటీ విషయానికి వస్తే బజాజ్ పల్సర్ P150 హోండా యునికార్న్, హోండా ఎక్స్-బ్లేడ్ , సుజుకి జిక్సర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. -
బజాజ్ పల్సర్ కొత్త బైక్..ధర ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టూ వీలర్ల తయారీ దిగ్గజం బజాజ్ ఆటో మరో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. ఎన్ఎస్ సిరీస్‌లో కొత్త వెర్షన్‌గా బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 బైక్‌ను గురువారం విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ ధరను రూ. 1.09 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది. 200సీసీ ఇంజీన్ తో దీన్ని వినూత్నంగా రూపొందించింది. ఏబీస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్‌తో అప్ గ్రేడ్ చేసి, 200 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజీన్‌తో ఈ బైక్‌ను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏబీస్‌పై తమకు చాలా అభ్యర్థనలు వచ్చాయని..అందుకే అప్‌గ్రేడ్ వెర్షన్‌గా బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 లాంచ్ చేశామని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (మోటారుసైకిల్స్) ఎరిక్ వాస్ తెలిపారు. ఈ ఏబీఎస్ వేరియంట్ బైక్ పనితీరును మెరుగుపరుస్తుందనీ, అలాగే పెర్ఫామెన్స్ సెగ్మెంట్లో తమ లీడర్ షిప్ మరింత బలపడుతుందన్ని విశ్వాసాన్నివ్యక్తంచేశారు. తమ జాగా బైక్ అన్ని మెట్రో నగరాల్లో ప్రస్తుతం కొత్త వేరియంట్ ప్రవేశపెడుతున్నామనీ, అనంతరం దేశంలో అన్ని డీలర్‌షిప్‌ల ద్వారా క్రమక్రమంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు. -
పల్సర్ బైక్స్ రేట్లు పెరిగాయ్!
బజాజ్ ఆటో తన ప్రముఖ మోడల్స్ అన్నింటిపైనా రేట్లను పెంచుతోంది. డొమినార్ 400 మోడల్ పై ధరను పెంచిన అనంతరం తన ప్రముఖ మోడల్ పల్సర్ బైకులపై కూడా రేట్లను పెంచింది. పల్సర్ మోడల్స్ పై ధరను 1,001 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించింది. పెంచిన ధరలు పల్సర్ 135ఎల్ఎస్ నుంచి పల్సర్ ఆర్ఎస్200 వరకున్న అన్ని మోడల్స్ పైనా అమల్లోకి రానున్నాయని బజాజ్ ఆటో పేర్కొంది. ధరల పెంపు తర్వాత ఎంట్రీ-లెవల్ పల్సర్ 135ఎల్ఎస్ బైక్ ప్రారంభ ధర రూ.61,177కాగ, పాపులర్ పల్సర్ 150 బైకు 75,604 రూపాయలు. పల్సర్ 180 కొత్త ధర రూ.80,546. ఈ ఏడాదిలో బజాజ్ రేట్లను పెంచడం ఇది రెండోసారి. గత నెలలోనే డొమినార్ మోడల్ ధరలను పెంచింది. 200సీసీ కేటగిరీలోని బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 నాన్-ఏబీఎస్ వేరియంట్ ధర రేట్ల పెంపు తర్వాత రూ.1.22 లక్షలు(ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా ఉంది. ఏబీఎస్ వేరియంట్ ధర రూ.1.34 లక్షలు. అదేవిధంగా పల్సర్ ఎన్ఎస్ 200 బైక్ ధర రూ.97,452 రూపాయలు. ఈ బైక్ రెండు మోడల్స్ ను కలిగి ఉంది. ఈ రెండు మోడల్స్ 199.5 సీసీ సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్, ఎస్ఓహెచ్సీ లిక్విడ్ కూలెడ్ ఇంజిన్ ను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం బజాజ్ తన మోడల్స్ లో చాలావాటిలో ధరలను పెంచింది. డిస్కవర్, అవెంజర్, ప్లాటినా కంఫోర్డెక్, వీ, సీటీ100లపై కూడా త్వరలోనే రేట్లను పెంచనుంది. 2017 మేలో ఈ టూ-వీలర్ కంపెనీ మొత్తం విక్రయాల్లో 10 శాతం పడిపోయింది. దేశీయంగా ఈ కంపెనీ విక్రయాలు క్షీణించాయి.