పల్సర్ బైక్స్ రేట్లు పెరిగాయ్!
పల్సర్ బైక్స్ రేట్లు పెరిగాయ్!
Published Tue, Jun 6 2017 2:13 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
బజాజ్ ఆటో తన ప్రముఖ మోడల్స్ అన్నింటిపైనా రేట్లను పెంచుతోంది. డొమినార్ 400 మోడల్ పై ధరను పెంచిన అనంతరం తన ప్రముఖ మోడల్ పల్సర్ బైకులపై కూడా రేట్లను పెంచింది. పల్సర్ మోడల్స్ పై ధరను 1,001 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించింది. పెంచిన ధరలు పల్సర్ 135ఎల్ఎస్ నుంచి పల్సర్ ఆర్ఎస్200 వరకున్న అన్ని మోడల్స్ పైనా అమల్లోకి రానున్నాయని బజాజ్ ఆటో పేర్కొంది. ధరల పెంపు తర్వాత ఎంట్రీ-లెవల్ పల్సర్ 135ఎల్ఎస్ బైక్ ప్రారంభ ధర రూ.61,177కాగ, పాపులర్ పల్సర్ 150 బైకు 75,604 రూపాయలు. పల్సర్ 180 కొత్త ధర రూ.80,546. ఈ ఏడాదిలో బజాజ్ రేట్లను పెంచడం ఇది రెండోసారి. గత నెలలోనే డొమినార్ మోడల్ ధరలను పెంచింది.
200సీసీ కేటగిరీలోని బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 నాన్-ఏబీఎస్ వేరియంట్ ధర రేట్ల పెంపు తర్వాత రూ.1.22 లక్షలు(ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా ఉంది. ఏబీఎస్ వేరియంట్ ధర రూ.1.34 లక్షలు. అదేవిధంగా పల్సర్ ఎన్ఎస్ 200 బైక్ ధర రూ.97,452 రూపాయలు. ఈ బైక్ రెండు మోడల్స్ ను కలిగి ఉంది. ఈ రెండు మోడల్స్ 199.5 సీసీ సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్, ఎస్ఓహెచ్సీ లిక్విడ్ కూలెడ్ ఇంజిన్ ను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం బజాజ్ తన మోడల్స్ లో చాలావాటిలో ధరలను పెంచింది. డిస్కవర్, అవెంజర్, ప్లాటినా కంఫోర్డెక్, వీ, సీటీ100లపై కూడా త్వరలోనే రేట్లను పెంచనుంది. 2017 మేలో ఈ టూ-వీలర్ కంపెనీ మొత్తం విక్రయాల్లో 10 శాతం పడిపోయింది. దేశీయంగా ఈ కంపెనీ విక్రయాలు క్షీణించాయి.
Advertisement
Advertisement