సాక్షి, ముంబై: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన 102 సీసీ బైక్ ‘ప్లాటినా 100 ఈఎస్’ కొత్త వెర్షన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ఈ ప్లాటినా 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ (ఇఎస్) వేరియంట్‌ను ఎక్స్ షోరూం వద్ద ధరను రూ.53,920గా నిర్ణయించింది. ఇది భారత మార్కెట్లో లభించే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్-స్టార్ట్ బైక్ అని సంస్థ వెల్లడించింది. ఈ కొత్త వెర్షన్‌లో అమర్చిన స్ప్రింగ్–ఇన్–స్ప్రింగ్ సస్పెషన్... రైడర్‌తో పాటు తోటి ప్రయాణికుడికి మెరుగైన సదుపాయాన్ని అందించనుంది. అలాగే సుదీర్ఘ ప్రయాణాలను మరింత సౌకర్యవంతం చేస్తుంది.
స్ప్రింగ్-ఇన్-స్ప్రింగ్ సస్పెన్షన్ లాంటి కొత్త ఫీచర్లతో పాటు ఇబ్బందులు లేని, సురక్షితమైన ప్రయాణం కోసం ట్యూబ్‌లెస్ టైర్లను ఇందులో అమర్చారు. ప్లాటినా బ్రాండ్ తన సెగ్మెంట్‌లో విశిష్ట సేవలు అందిస్తూ 7 మిలియన్ల మంది కస్టమర్ల అభిమాన్ని సొంతం చేసుకుందని బజాజ్ మార్కెటింగ్ హెడ్ సుందరరామన్ ఈ సందర్భంగా తెలిపారు. కస్టమర్లను కొత్త వెర్షన్ ఆకర్షిస్తుందని సుందరరామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో భారతదేశంలో ప్లాటినా 100 కిక్-స్టార్ట్ మోడల్‌ను, రూ.51,667 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
అత్యంత తక్కువ ధర: బజాజ్ ప్లాటినా 100 ఈఎస్
Published Wed, Mar 3 2021 10:18 AM | Last Updated on Wed, Mar 3 2021 11:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment