కొత్త బజాజ్‌ ప్లాటినా బైక్‌ : ధర ఎంతంటే? | 2021 Bajaj Platina 110 ABS launched,price details here | Sakshi
Sakshi News home page

కొత్త బజాజ్‌ ప్లాటినా బైక్‌ : ధర ఎంతంటే?

Published Fri, Mar 5 2021 11:50 AM | Last Updated on Fri, Mar 5 2021 1:31 PM

2021 Bajaj Platina 110 ABS  launched,price details here - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్‌ ఆటో గురువారం దేశీయ మార్కెట్లోకి కొత్త బజాజ్‌ ప్లాటినా 110 ఏబీఎస్‌ బైక్‌ను విడుదల చేసింది. ఎక్స్‌ షోరూం ధర రూ.65,920 గా నిర్ణయించింది. ‘స్ప్రింగ్‌-ఆన్‌-స్ప్రింగ్‌’ నిట్రాక్స్‌ సస్పెన్షన్, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఫీచర్లను కలిగిన ఈ బైక్‌లో ట్యూబ్‌లెస్‌ టైర్లను అమర్చారు. (టియాగో.. కొత్త వేరియంట్‌)

బ్రేకింగ్‌ సెగ్మెంట్‌లో అత్యుత్తమ టెక్నాలజీని కలిగిన  తమ కొత్త ప్లాటినా 110 లక్షలాది మంది భారతీయులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తుందని కంపెనీ మోటార్‌సైకిల్‌ విభాగం అధ్యక్షుడు సరంగ్‌ కనడే తెలిపారు. దేశవ్యాప్తంగా 7 మిలియన్ల మంది కస్టమర్ల అభిమాన్ని సొంతం చేసుకున్న ప్లాటినా బ్రాండ్‌ ఇప్పుడు ఏబీఎస్‌ చేరికతో తన పోటీదారుల కంటే మరింత ముందుకు దూసుకెళ్లిందని కనేడే తెలిపారు.  (అత్యంత తక్కువ ధర: బజాజ్‌ ప్లాటినా 100 ఈఎస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement