
ముంబై: బైక్ లవర్లకు శుభవార్త. స్పోర్ట్స్ బైక్స్‌లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న బజాన్ డొమినర్ ధరలు తగ్గాయి. బజాజ్ ఆటో తన డొమినర్ 250 మోడళ్ల ధరలపై రూ.16,800 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ధర తగ్గింపుతో ఈ మోడల్ ధర రూ.1.54 లక్షలకు దిగిరానుంది. ‘‘ఆటో కంపెలన్నీ వాహన ధరలను పెంచుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో డొమినార్ మోడళ్ల ధరలను తగ్గిస్తున్నాము. కస్టమర్లకు స్పోర్ట్స్, టూరింగ్ సదుపాయాలను మరింత చేరువ చేసేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది’’ అని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనడే తెలిపారు.
గతేడాది మార్చిలో విడుదలైన డొమినర్ 248.8 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. స్పోర్ట్స్ బైక్ కేటగిరిలో డోమినర్ ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. ధర తగ్గింపుతో డొమినర్ అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉంది.