
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఆటో విక్రయాలు భారీగా క్షీణించాయి. మే నెలలో ఈ కంపెనీ ఆటో విక్రయాలు 70 శాతం తగ్గి 1,27,128 యూనిట్లుగా నమోదైనట్లు బజాజ్ ఆటో మంగళవారం వెల్లడించింది. గతేడాది మే నెలలో విక్రయాలు 4,19,235 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ విక్రయాలు సైతం గతేడాదితో పోలిస్తే 83 శాతం తగ్గి 2,35,824 యూనిట్ల నుంచి 40,074 యూనిట్లుగా నమోదయ్యాయని తెలిపింది. ఇక ద్విచక్ర వాహనాలు సైతం గతేడాదిలో 3,65,068 యూనిట్లు ఉండగా ఇప్పుడు 69 శాతం 1,12,798 యూనిట్లకు చేరాయి.దేశీయ ద్విచక్రవాహనాలు సైతం 2019తో పోలిస్తే 81 శాతం తగ్గి 39,286 యూనిట్లకు చేరాయి. ఇక వాణిజ్య వాహనాలు సైతం 74శాతం తగ్గి 14,330 యూనిట్లు నమోదవ్వగా, దేశీయ విక్రయాలు 97శాతం పడిపోయాయని బజాజ్ ఆటో వివరించింది.ఎగుమతుల్లో మొత్తం 53 శాతంక్షీణించి 87,054 యూనిట్లకు చేరాయని కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment