
బజాజ్ వాహన ధరలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘బజాజ్ ఆటో’ తాజాగా తన మోటార్‌సైకిల్స్ ధరలను తగ్గించింది. రూ.4,500 వరకు డిస్కౌం ట్‌ను ఆఫర్ చేస్తోంది. ధరల తగ్గింపు నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. జీఎస్‌టీ వల్ల లభించనున్న ప్రయోజనాలను కస్టమర్లకు అందించడమే లక్ష్యంగా ధరలు తగ్గించామని తెలిపింది.
తగ్గింపు ప్రయోజనాలు రాష్ట్రాన్ని బట్టి, మోడల్‌ను బట్టి మారతాయి’ అని కంపెనీ వివరించింది. కాగా బజాజ్ ఆటో కంపెనీ సీటీ–100 మొదలు డొమినార్–400 వరకు పలు మోడళ్లను భారత్‌లో విక్రయిస్తోంది.