బజాజ్ సీటీ100 కొత్త వేరియంట్ | bajaj ct 100 new varient | Sakshi
Sakshi News home page

బజాజ్ సీటీ100 కొత్త వేరియంట్

Published Sat, Feb 6 2016 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

బజాజ్ సీటీ100 కొత్త వేరియంట్

బజాజ్ సీటీ100 కొత్త వేరియంట్

మైలేజీ 99.1 కి.మీ.  ధర రూ.30,990
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో కంపెనీ తన ఎంట్రీ లెవెల్ మోటార్‌సైకిల్ మోడల్ సీటీ100లో కొత్త వేరియంట్‌ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. సీటీ100 బీ పేరుతో తామందిస్తున్న ఈ బైక్ 99.1 కి.మీ. మైలీజీని ఇస్తుందని, రెండేళ్ల వారంటీని ఇస్తున్నామని బజాజ్ ఆటో తెలిపింది. ధర రూ.30,990(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని బజాజ్ ఆటో ప్రెసిడెంట్(మోటార్‌సైకిల్స్ బిజినెస్) ఎరిక్ వాస్ తెలిపారు. సీటీ 100 బైక్‌లో ఉన్న ఇంజిన్‌ను మరింత మెరుగుపరచి ఈ సీటీ100బీలో అమర్చామని వివరించారు.పెద్ద హెడ్‌ల్యాంప్, మందమైన, సౌకర్యవంతమైన సీటు తదితర ప్రత్యేకతలున్నాయని వివరించారు. కాగా ఈ కంపెనీ ఇటీవలనే 150 సీసీ సెగ్మెంట్లో వీ15 మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ బైక్‌ను భారత తొలి విమాన వాహన నౌక విక్రాంత్ స్క్రాప్ నుంచి రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement