ముంబై: అటో దిగ్గజం బజాబ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్లు "చేతక్" డెలివరీలను సెప్టెంబర్ నుంచి చేపట్టాలని భావిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ 2020-21 వార్షిక నివేదికలో తెలిపింది. ఈ-స్కూటర్ చేతక్ ప్రీమియం, చేతక్ అర్బన్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. అర్బన్ వేరియంట్ ధర రూ.1,22,000(ఎక్స్-షోరూమ్)కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.1,26,000 (ఎక్స్-షోరూమ్). అలాగే వచ్చే మూడు నెలల్లో ఇతర మెట్రో నగరాల్లో బజాజ్ చేతక్ సేవలు అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో ఐపీ6 వాటర్ రెసిస్టెన్స్ లిథియం ఐయాన్ బ్యాటరీని అమర్చారు. ఫుల్ చార్జింగ్ చేస్తే ఎకో మోడ్‌లో 95 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
2020 మొదట్లోనే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కోవిడ్ సంబంధిత సమస్యలతో అప్పట్లో బుకింగ్స్ నిలిపేశారు. తిరిగి ఈ ఏప్రిల్ 18న ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆన్‌లైన్‌లో రీ-ఓపెన్ చేశారు. భారీ డిమాండ్ నేపథ్యంలో వెంటనే నిలిపేశారు. ఇతర కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవడానికి వీలుగా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని చూస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. త్వరలోనే మళ్లీ సప్లై వంటి అంశాలను సమీక్షించి బుకింగ్ తెరిచేలా నిర్ణయం తీసుకుంటామని బజాజ్ ఆటో ప్రకటించింది.
చదవండి: వాట్సాప్ వార్నింగ్.. ఈ యాప్ వాడితే మీ అకౌంట్ బ్లాక్
Comments
Please login to add a commentAdd a comment