రూ.లక్షకే చేతక్‌ స్కూటర్‌ | Bajaj Chetak 2901 Launched At Rs 95,998, Offers 123 Km-Range | Sakshi
Sakshi News home page

రూ.లక్షకే చేతక్‌ స్కూటర్‌

Published Sat, Jun 8 2024 6:11 AM | Last Updated on Sat, Jun 8 2024 6:11 AM

Bajaj Chetak 2901 Launched At Rs 95,998, Offers 123 Km-Range

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీలో ఉన్న బజాజ్‌ చేతక్‌ తాజాగా 2901 మోడల్‌ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌ ఎక్స్‌షోరూంలో ధర రూ.99,998 ఉంది. కంపెనీ ఆఫర్‌ చేస్తున్న మోడళ్లలో ఇదే తక్కువ ధర కలిగింది. చేతక్‌ అర్బేన్‌ ధర రూ.1,23,319 కాగా, చేతక్‌ ప్రీమియం రూ.1,47,243 ఉంది. 

2901 మోడల్‌ స్కూటర్‌ ఒకసారి చార్జింగ్‌తో 123 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2.88 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ పొందుపరిచారు. టాప్‌ స్పీడ్‌ గంటకు 63 కిలోమీటర్లు. స్టీల్‌ బాడీతో తయారైంది. చార్జింగ్‌కు 6 గంటలు తీసుకుంటుంది. రూ.3 వేలు చెల్లించి టెక్‌ప్యాక్‌ సబ్‌్రస్కిప్షన్‌ తీసుకుంటే హిల్‌ హోల్డ్‌ అసిస్ట్, రివర్స్‌ మోడ్, యాప్‌ కనెక్టివిటీ, కాల్‌ మేనేజ్‌మెంట్, మ్యూజిక్‌ కంట్రోల్, జియో–ఫెన్సింగ్‌ ఫీచర్లు అదనంగా చేరతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement