బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్ ఏర్పడింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రీ బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 48 గంటల్లో అన్ని యూనిట్లను అమ్ముడు పోయినట్లు కంపెనీ పేర్కొంది. ఇతర కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవడానికి వీలుగా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని చూస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కస్టమర్ స్పందనపై బజాజ్ ఆటో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ మాట్లాడుతూ.. "పూణే, బెంగళూరులోని చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ తిరిగి ప్రారంభించి నప్పుడు అద్భుతమైన స్పందన వచ్చింది" అని పేర్కొన్నాడు.
త్వరలోనే మళ్లీ సప్లై వంటి అంశాలను సమీక్షించి బుకింగ్ తెరిచేలా నిర్ణయం తీసుకుంటామని బజాజ్ ఆటో ప్రకటించింది. గతేడాది 2020 సంవత్సరం ఆరంభంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. రెండు వేరియంట్స్‌లో మార్కెట్‌లోకి రాగా.. అందులో ఒకటి ప్రీమియం రకం కాగా, మరొకటి అర్బేన్ వేరియంట్. అర్బేన్ వేరియంట్ ధర రూ.1,22,000(ఎక్స్-షోరూమ్)కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.1,26,000 (ఎక్స్-షోరూమ్). అలాగే వచ్చే మూడు నెలల్లో ఇతర మెట్రో నగరాల్లో బజాజ్ చేతక్ సేవలు అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment