న్యూఢిల్లీ: చేతక్ స్కూటర్‌ను బజాజ్ ఆటో మళ్లీ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నేటి అవసరాలకు అనుగుణంగా, పర్యావరణహితంగా దీన్ని రూపొందించారు. చూడగానే ఆకట్టుకునేలా సరికొత్త రూపంతో ఎలక్ట్రిక్ వాహనంగా చేతక్ వినియోగదారులకు ముందుకు రానుంది. జనవరిలో ముందుగా పుణెలో ఆ తర్వాత బెంగళూరులో అమ్మకాలు ప్రారంభిస్తారు. కొత్త చేతక్ స్కూటర్‌కు సంబంధించిన 5 ఆసక్తికర అంశాలు మీకోసం.
1. ఎలక్ట్రిక్ వాహనంగా తయారైన కొత్త చేతక్‌లో 4కేవీ ఎలక్ట్రిక్ మోటర్‌తో పాటు ఐపీ67 రేటింగ్ లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చారు.
2. ఎలక్ట్రిక్ వాహనాల గురించి కొనేటప్పుడు రేంజ్ (మైలేజీ) గురించి అడుగుతారు. చేతక్ ఎకానమీ మోడ్‌లో 95 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్‌లో 85 కిలోమీటర్ల రేంజ్ వరకు నడుస్తుంది.
3. లోహపు బ్యాడీతో ఆకర్షణీయంగా ముస్తాబైన బజాబ్ చేతక్ ఆరు రంగుల్లో లభ్యమవుతుంది. డిజిటల్ కన్‌సోల్, గుర్రపునాడ ఆకారంలో డీఆర్‌ఎల్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ బ్లింకర్స్ ఉన్నాయి.
4. వేగాన్ని సులువుగా నియంత్రించేలా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఉంది. 12 అంగులాల చక్రాలు అమర్చారు. ముందు చక్రానికి డిస్క్ బ్రేక్ ఉంది. అయితే బజాజ్ బ్యాడ్జ్(లోగో) మాత్రం లేదు.
5. కొత్త చేతక్ ధర రూ. 90 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు ఉంటుంది. (చదవండి: చేతక్ మళ్లీ వచ్చేసింది!!)
Comments
Please login to add a commentAdd a comment