Bajaj Chetak Scooter Price Hiked For Third Time In 2021 - Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు బజాజ్ షాక్!

Published Wed, Sep 29 2021 5:33 PM | Last Updated on Thu, Sep 30 2021 11:09 AM

Bajaj Chetak Price Hiked For The Third Time in 2021 - Sakshi

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ దిగ్గజం బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక ధరను మరోసారి భారీగా పెంచింది. 2021లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర పెరగడం ఇది మూడోసారి. ఈ ధరల పెరుగుదలతో భారతదేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా చేతక్ మారింది. తాజాగా మహారాష్ట్రలో బజాజ్ చేతక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,87,390గా ఉంది. కొన్ని నెలల క్రితం వరకు ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,44,987గా ఉండేది. 2020లో లాంఛ్ చేసిన ధరతో పోలిస్తే చేతక్ ధర 60 శాతానికి పైగా పెరిగింది.

కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఫేమ్-2 కింద సబ్సిడీని పెంచిన తర్వాత తాజాగా బజాజ్ కంపెనీ మరోసారి ధరల పెంచింది. ఫేమ్-2 కింద కంపెనీకి రూ.45,000 వరకు సబ్సిడీ లభిస్తోంది. ప్రస్తుతం ఇంతకంటే తక్కువ ధరకు ఓలా ఎస్ 1 ప్రొ, అథర్ 450 ఎక్స్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీనిలో 2 కిలోవాట్‌ బ్యాటరీలు అమర్చారు. బ్యాటరీలకు 3 ఏళ్లు లేదా 50,000 కి,మీ వారంటీ అందిస్తున్నారు. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే మోడ్‌ను బట్టి 85 నుంచి 95 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు.

ఇందులో స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ అనే రెండు మోడ్స్ ఉన్నాయి. 5 ఆంపియర్ పవర్ సాకెట్ ద్వారా స్కూటర్ ని ఇంటి వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ బేస్డ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, స్మార్ట్ ఫోన్ యాప్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రస్తుతం బజాజ్ చేతక ప్రీమియం వేరియంట్ మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంది. అర్బన్ వేరియంట్ ను నిలిపివేసింది.(చదవండి: మూడు కోట్ల ఖరీదైన కారు.. ఆ సమస్యతో రీకాల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement