Bhavish Aggarwal Announced a Future Factory Event - Sakshi
Sakshi News home page

ఓలా ‍ఫ్యాక్టరీ టూర్‌.. ఎప్పుడంటే?

Published Sat, Jun 11 2022 4:50 PM | Last Updated on Sun, Jun 12 2022 12:51 PM

Bhavish Aggarwal Announced future Factory event - Sakshi

అతి తక్కువ కాలంలోనే ఇండియన్‌ మార్కెట్‌పై చెరగని ముద్ర వేసింది ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌. ఇప్పటికే లక్షకు పైగా ఆర్డర్లు ఉన్నాయి ఈ స్కూటర్‌ కోసం. డెలివరీ, సర్వీసు విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా మొత్తంగా ఓలా స్కూటర్‌కి క్రేజ్‌ అయితే తగ్గలేదు. కాగా తమ కస్టమర్లకు మరో అవకాశం ఇచ్చారు ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌. 

ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ ఫ్యాక్టరీ తమిళనాడులో ఉంది. భారీ ఎత్తున ఇక్కడ స్కూటర్లు తయారు చేస్తున్నారు. తమ కస్టమర్లు స్కూటర్లు ఎలా తయరవుతున్నాయో నేరుగా చూసే అవకాశం కల్పిస్తున్నారు భవీశ్‌ అగర్వాల్‌. 2022 జూన్‌ 19 ఆదివారం ఓలా ఫ్యాక్టరీలో ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి ఎంపిక చేసిన వెయ్యి మంది కస్టమర్లను పిలవాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఈ సంఖ్యపై పరిమితి ఎత్తేశారు. ఇప్పటి వరకు ఓలా స్కూటర్లు యాభై వేల మందికి పైగా డెలివరీ అయ్యాయి. వీరందరూ ఈవెంట్‌కు రావొచ్చంటూ భవీశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

చదవండి: కారులో శృంగారం.. రూ.40.83 కోట్ల నష్టపరిహారం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement