
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో 'ఒకాయ ఎలక్ట్రిక్' దేశీయ మార్కెట్లో 'ఫాస్ట్ ఎఫ్2ఎఫ్' స్కూటర్ లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 83,999 (ఎక్స్-షోరూమ్).
ఒకాయ ఫాస్ట్ ఎఫ్2ఎఫ్ స్కూటర్ 800డబ్ల్యు బిఎల్‌డిసి హబ్ మోటార్ & 2.2 కిలోవాట్ లిథియం అయాన్ ఎల్‌ఎఫ్‌పి బ్యాటరీ పొందుతుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 70 నుంచి 80 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. అదే సమయంలో ఈ స్కూటర్ 4 నుంచి 5 గంటల సమయంలో 0-100 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ మీద 2 సంవత్సరాలు లేదా 20,000 కి.మీ వారంటీ అందిస్తుంది.
ఫాస్ట్ ఎఫ్2ఎఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ సియాన్, మ్యాట్ గ్రీన్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ సిల్వర్, మెటాలిక్ వైట్ అనే ఆరు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, హైడ్రాలిక్ స్ప్రింగ్-లోడెడ్ రియర్ షాక్ అబ్జార్బర్స్ వంటివి ఈ స్కూటర్‌లో ఉన్నాయి.
ఒకాయ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలిష్ డిఆర్ఎల్ హెడ్‌ల్యాంప్, షార్ప్ టెయిల్‌ల్యాంప్ వంటి వాటితో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇందులో స్కూటర్ గురించి మొత్తం సమాచారం తెలుసుకోవచ్చు. ఇది 10 ఇంచెస్ ట్యూబ్‌లెస్ టైర్లతో నడుస్తుంది. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న కంపెనీ షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment