హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓలా ఎలక్ట్రిక్ కొత్త స్కూటర్లను ఆవిష్కరించింది. ఎస్1 శ్రేణిలో రూ. 99,999 ధరలో నూతన వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 91 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. డెలివరీలు ప్రారంభం అయ్యాయి. ఎస్1 ఎయిర్ పేరుతో మూడు వేరియంట్లను సైతం ఓలా పరిచయం చేసింది.
రూ.84,999 ధర గల 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ వేరియంట్ ఒకసారి చార్జింగ్‌తో 85 కిలోమీటర్లు పరుగెడుతుంది. టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. 3 కిలోవాట్ అవర్ వేరియంట్ 125 కిలోమీటర్లు, 4 కిలోవాట్ అవర్ రకం 165 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ధరలు వరుసగా రూ.99,999, రూ.1,09,999 ఉన్నాయి. ఎస్1 ఎయిర్ వేరియంట్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
Mike drop. Actually, the bike drop!!
— Bhavish Aggarwal (@bhash) February 9, 2023
So excited about this❤️🏍️ pic.twitter.com/0VVRhdz8pm
Comments
Please login to add a commentAdd a comment