
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న క్వాంటమ్ ఎనర్జీ హైదరాబాద్‌లో మూడవ షోరూంను ప్రారంభించింది. ఇంపాక్ట్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో 1000 చదరపు అడుగుల విశాలమైన షోరూమ్ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి అందుబాటులో ఉందని, దీంతో సంస్థ మొత్తం ఔట్‌లెట్ల సంఖ్య 23కు చేరుకుందని కంపెనీ డైరెక్టర్ సి.కుశాల్ తెలిపారు.
వీటిలో తెలంగాణలో నాలుగు కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా క్వాంటమ్ ఎనర్జీ ఎనమిది రాష్ట్రాల్లో విక్రయాలు సాగిస్తోంది. ప్లాస్మా, ఎలెక్ట్రాన్, మిలన్, బిజినెస్ పేర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ, విక్రయం చేపడుతోంది. ప్లాస్మా స్కూటర్ ఒకసారి చార్జింగ్‌తో 135 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment