హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒడిస్సీ నుంచి విద్యుత్ వాహనాల రెంటల్ సంస్థ బడ్–ఈ 10,000 వాహనాలను కొనుగోలు చేయనుంది. ఈ ఆర్డరు విలువ రూ. 100 కోట్లుగా ఉండనుంది. ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఒడిస్సీ సీఈవో నెమిన్ వోరా, బడ్–ఈ సహ వ్యవస్థాపకులు ఆదిత్య టేకుమళ్ల, విజయ్ మద్దూరి ఈ విషయాలు తెలిపారు.
18–24 నెలల వ్యవధిలో ఈ వాహనాలను అందుకోనున్నట్లు ఆదిత్య తెలిపారు. వ్యాపార సంస్థలతో పాటు వినియోగదారులకు లీజింగ్, రెంటల్ ప్రాతిపదికన వాహనాలను అందిస్తున్నట్లు, త్వరలో ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు వివరించారు.
మరోవైపు, ప్రస్తుతం నెలకు గరిష్టంగా 5,000 వాహనాలుగా ఉన్న ఉత్పత్తి సామర్ధ్యం కొత్త ప్లాంటు అందుబాటులోకి వస్తే 10,000కు పెరగనున్నట్లు నెమిన్ వోరా తెలిపారు. 68పైగా ఉన్న డీలర్ షిప్‌లను వచ్చే ఏడాది ఆఖరు నాటికి 150కి పెంచుకోనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment