
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా..అయితే మీకో అదిరిపోయే ఆఫర్. పాపులర్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను సగం ధరకే సొంత చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఆఫర్ విద్యార్థులకు, ఉద్యోగులకు మాత్రమే.. అది కూడా మార్చి 31 ఒక్క రోజు మాత్రమే.
(బంగారం కొనేవారికి అలర్ట్: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. మరి పాత బంగారం సంగతేంటి?)
విద్యార్థులు, ఉద్యోగులు ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.61,999, ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) స్కూటర్‌ను రూ. 69,999 లకే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ మార్చి 31 తర్వాత అందుబాటులో ఉండదు. వాస్తవంగా ఓలా ఎస్1 ఎక్స్ షోరూమ్ ధర రూ.1,09,900. అలాగే ఎస్1 ప్రో ధర రూ. 1,39,999. ఈ డీల్ 5.99 శాతం వడ్డీతో నెలకు రూ. 2,199 నో కాస్ట్ ఈఎంఐలో లభిస్తుంది. విద్యార్థులు, ఉద్యోగుల కోసం ఓలా ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ఎస్1 స్కూటర్‌పై రూ. 3,000, అలాగే ఎస్1 ప్రో స్కూటర్‌పై రూ. 5,000 తగ్గింపును పొందవచ్చు. ఇవి మాత్రమే కాక రూ. 10,000 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు.
(ఐఫోన్లకు కొత్త అప్‌డేట్.. నయా ఫీచర్స్ భలే ఉన్నాయి!)
ఈ ఆఫర్‌ను పొందడానికి విద్యార్థులు, ఉద్యోగులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు (ID)లో ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించాలి. అక్కడ కొనుగోలుదారులకు ఆఫర్ నిబంధనలు, షరతుల గురించి తెలియజేస్తారు.