
గుప్పెడంత మనసు సీరియల్ నుంచి బయటకు వచ్చాక జగతి మేడమ్ తన ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టింది.

అటు సోషల్ మీడియాలోనూ ట్రెడిషనల్, మోడ్రన్ దుస్తుల్లో మెరుస్తోంది. ఇకపోతే తను బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టనుందని ఇటీవల వార్తలు వచ్చాయి.

అయితే తెలుగు బిగ్‌బాస్ నుంచి కాకుండా కన్నడ టీమ్ నుంచి పిలుపు వచ్చిందట.

ఈ విషయాన్ని జ్యోతి వెల్లడించింది. కన్నడ బిగ్‌బాస్ షో కోసం నన్ను సంప్రదించారు.

ఈ ఆఫర్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. కానీ చేతిలో ఉన్న ప్రాజెక్టులు, మరికొన్ని పరిస్థితుల వల్ల ఓకే చెప్పలేకపోయాను.

మీరందిస్తున్న సపోర్ట్‌కు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినే! అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.







