ఫేమ్‌-2 పథకం పొడిగింపుపై కేంద్రం వ్యాఖ్యలు | Central Govt Denies Reports Of FAMEII Extension, See How Govt Reacted On This Rumours - Sakshi
Sakshi News home page

ఫేమ్‌-2 పథకం పొడిగింపుపై కేంద్రం వ్యాఖ్యలు

Published Sat, Mar 9 2024 2:32 PM | Last Updated on Sat, Mar 9 2024 4:02 PM

Central Govt Denies Reports Of FAMEII Extension - Sakshi

దేశంలో విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్‌-2 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు నెలలు పొడిగించబోతోందంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. 

ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం 2024 మార్చి 31తో ముగియనున్న సందర్భంగా మరో నాలుగు నెలల పాటు గడువును పొడిగిస్తారని, ఇందుకోసం అదనంగా రూ.500 కోట్లు కేటాయిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఈ పథకాన్ని పొడిగించే ప్రతిపాదనలేవీ లేవని తేల్చి చెప్పింది.

ఇదీ చదవండి: ఐటీ పరిశ్రమకు భారీ షాక్‌.. ‘70 శాతం ఉద్యోగాలు పోనున్నాయ్‌’

కేంద్రం ఫేమ్‌ పేరిట ఇప్పటికే రెండు దఫాల్లో విద్యుత్తు వాహన కొనుగోళ్లకు రాయితీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ టూవీలర్లు, త్రీవీలర్లు, ఫోర్‌ వీలర్లకు రాయితీ వర్తిస్తుంది. తొలుత ఫేమ్‌-2 కింద రూ.10వేల కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత దాన్ని రూ.11,500 కోట్లకు పెంచారు. నిధులు అందుబాటులో ఉండే వరకు ఈ పథకాన్ని పొడిగిస్తారనే వాదనలు వచ్చాయి. అయితే, సార్వత్రిక ఎన్నికల వేళ గడువు పొడిగిస్తారంటూ వార్తలు రాగా.. అవన్నీ అవాస్తవమని కేంద్రం చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement