చెంచులకు వంద శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ | Distribution Of Sheep With A Subsidy Of 100 Per Cent To Chenchu Peoples | Sakshi
Sakshi News home page

చెంచులకు వంద శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ

Published Sun, Jun 24 2018 11:40 AM | Last Updated on Sun, Jun 24 2018 11:40 AM

Distribution Of Sheep With A Subsidy Of 100 Per Cent To Chenchu Peoples - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న పశుసంవర్ధక శాఖ జేడీ సుదర్శన్‌కుమార్‌  

సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్‌) : జిల్లాలోని చెంచులకు వందశాతం సబ్సిడీతో ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద మినీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సుదర్శన్‌కుమార్‌ తెలిపారు. చెంచులకు 250 యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం తన చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనిట్‌ కాస్ట్‌ రూ.30వేలు ఉండగా రూ.22,500 ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, మిగిలిన రూ.7,500 ఐటీడీఏ భరిస్తుందని తెలిపారు.

ఆళ్లగడ్డ మండలానికి 16 యూనిట్లు, రుద్రవరం ఏడు యూనిట్లు, జూపాడుబంగ్లా 3, నందికొట్కూరు 4, ఆత్మకూరు 109, బండి ఆత్మకూరు 26, కొత్తపల్లి 18, మహానంది 1, పాణ్యం 10, శ్రీశైలానికి 26, వెలుగోడుకు 30 ప్రకారం మొత్తం 250 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని పారదర్శకంగా పంపిణీ చేయాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీడీలు పి.రమణయ్య, జీవీ రమణ, సీవీ రమణయ్య, పలువురు పశువైద్యులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement