సాక్షి, హైదరాబాద్: రైతులు రుణం తీసుకుని ఆయిల్‌పామ్ సాగు చేసినా వారికి చెందాల్సిన సబ్సిడీని అందజేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రుణం అనేది ఆప్షన్ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయిల్‌పామ్ సాగులో సబ్సిడీలు ఎత్తేయడంలేదని స్పష్టం చేశారు.
ఆయిల్‌పామ్ డిమాండ్‌ను గమనించే ప్రోత్సాహిస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేసి జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. ఇప్పటి వరకు 30 వేలమంది రైతులను క్షేత్రస్థాయి సందర్శనలకు తీసుకెళ్లి అవగాహన కల్పించామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment