విమాన టికెట్‌ ధరలు చాలా తక్కువేనంటూ.. కేంద్రంపై చిదంబరం సెటైర్లు! | Chidambaram Slams Govt Over High Airfare For Business Class | Sakshi
Sakshi News home page

‘ప్రపంచానికి ఇండియానే విశ్వగురూ’.. మోత మోగుతున్న విమాన ఛార్జీలు.. కేంద్రంపై చిదంబరం సెటైర్లు!

Published Sun, Jun 18 2023 6:58 PM | Last Updated on Sun, Jun 18 2023 7:19 PM

Chidambaram Slams Govt Over High Airfare For Business Class - Sakshi

విమాన టికెట్‌ ధరలపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో వ్యంగంగా ట్వీట్‌ చేశారు. రెండు విమాన సంస్థలకు చెందిన ఢిల్లీ - చెన్నై బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ధరలు రూ.63,000, రూ.57,000 చాలా తక్కువేనని అన్నారు. 

‘ఢిల్లీ- చెన్నై విస్తారా, ఎయిరిండియా బిజినెస్‌ క్లాస్‌ విమాన టికెట్లు చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. రూ.6300, రూ.5700 చాలా తక్కువ.‘అయ్యో, క్షమించండి టికెట్‌ ధరలు తక్కువగానే ఉన్నాయి. ఒక విమాన టికెట్‌ ధర రూ.63,000, మరో విమాన టికెట్‌ ధర రూ.57,000 ఉన్నాయని ట్వీట్‌ చేశారు. భారత్‌ స్వేచ్ఛా మార్కెట్‌. డిమాండ్ పెరిగినప్పుడు సరఫరా పెరుగుతుంది, ”అని ట్వీట్‌లో పేర్కొన్నారు.  

‘భారత్‌ ఫ్రీ మార్కెట్‌. డిమాండ్ పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి. విమానయాన సంస్థలు తమ మార్గాలను విస్తరిస్తాయి. పాత మార్గాల్లో విమానాలను తగ్గించి వాటి ధరల్ని పెంచుతాయి. గుత్తాధిపత్య పెట్టుబడిదారీ విధానంలో భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు అవుతుంది’అని వ్యంగంగా ట్వీట్‌లో తెలిపారు.   


చిదంబరానికి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎలా స్పందిస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మీరు బిజినెస్ క్లాస్‌లో ఎందుకు ప్రయాణం చేస్తారు? ఎకానమీ క్లాస్‌లో ఎందుకు ప్రయాణించరు?  చిదంబరం ఒక తెలివిగల రాజకీయవేత్త. ప్రొఫెషనల్‌గా చెన్నై-ఢిల్లీ నుండి ఎకానమీ ఛార్జీలను కూడా తనిఖీ చేసి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని ఓ నెటిజన్ కామెంట్‌ చేశాడు. 

ఇదీ చదవండి : రూ.88,000 కోట్ల విలువైన రూ.500 నోట్ల మిస్సింగ్‌.. స్పందించిన ఆర్‌బీఐ!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement