chidamabaram
-
దమ్ముంటే అక్కడ గెలవండి! చిదంబరానికి మంత్రి హరీష్ రావు కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణాల బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విమర్శల వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యలపై తెలంగాణా మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందంటూ ఎక్స్ (ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉందని అపుడుఅధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. అప్పటి నెహ్రు ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయారనీ,చరిత్ర తెలియనిది కేసీఆర్‌కి కాదుచిదంబరమే చరిత్ర తెలియకుండా వక్ర భాష్యాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేదనే సంగతిని మర్చి,అప్పట్లో మద్రాసు రాష్ట్రం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం లేకుండే అని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ అప్పులు, ఆదాయం పై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహించాలన్నారు. అలాగే తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికల్ని పరిశీలిస్తే మంచిదని కూడా అన్నారు. చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు అవకాశమిచ్చారు. చిదంబరంకు దమ్ముంటే ఆయన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. తెలంగాణ సాధించింది కేసీఆర్ . సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మెడల్‌గా నిలిపింది కేసీఆర్ అంటూ ట్వీట్ చేశారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా.. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నరు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీనే దీవించబోతున్నారు అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పు భారీగా పెరిగిందని చిదంబరం కేసీఆర్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోమాట్లాడిన ఆయనతెలంగాణ అప్పు రూ.3.66లక్షల కోట్లకు చేరుకుందని, ప్రతి తెలంగాణ పౌరుడిపై సగటున రూ. లక్ష అప్పు ఉందని వ్యాఖ్యానించారు. వంట గ్యాస్ సిలిండర్ ధర ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. హైదరాబాద్‌లోనే ఎక్కువనీ, నిరుద్యోగం, అధిక ధరల్ని నియంత్రించడంలో ఇంతచేసినా ప్రభుత్వం విద్య, ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్న నిధులు అరకొరగానే ఉన్నాయని విమర్శించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉంది తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం చేసింది. 👉 పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. 👉పొట్టి… — Harish Rao Thanneeru (@BRSHarish) November 16, 2023 -
విమాన టికెట్ ధరలు చాలా తక్కువేనంటూ.. కేంద్రంపై చిదంబరం సెటైర్లు!
విమాన టికెట్ ధరలపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో వ్యంగంగా ట్వీట్ చేశారు. రెండు విమాన సంస్థలకు చెందిన ఢిల్లీ - చెన్నై బిజినెస్ క్లాస్ టికెట్ ధరలు రూ.63,000, రూ.57,000 చాలా తక్కువేనని అన్నారు. ‘ఢిల్లీ- చెన్నై విస్తారా, ఎయిరిండియా బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. రూ.6300, రూ.5700 చాలా తక్కువ.‘అయ్యో, క్షమించండి టికెట్ ధరలు తక్కువగానే ఉన్నాయి. ఒక విమాన టికెట్ ధర రూ.63,000, మరో విమాన టికెట్ ధర రూ.57,000 ఉన్నాయని ట్వీట్ చేశారు. భారత్ స్వేచ్ఛా మార్కెట్. డిమాండ్ పెరిగినప్పుడు సరఫరా పెరుగుతుంది, ”అని ట్వీట్లో పేర్కొన్నారు. Delhi-Chennai Business Class air tickets on Vistara and Air India have been set at a 'reasonable' price of Rs 6300 and Rs 5700 respectively Oops, sorry, they are set at a 'very reasonable' Rs 63,000 and Rs 57,000 respectively In free markets, when demand increases, supply will… — P. Chidambaram (@PChidambaram_IN) June 18, 2023 ‘భారత్ ఫ్రీ మార్కెట్. డిమాండ్ పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి. విమానయాన సంస్థలు తమ మార్గాలను విస్తరిస్తాయి. పాత మార్గాల్లో విమానాలను తగ్గించి వాటి ధరల్ని పెంచుతాయి. గుత్తాధిపత్య పెట్టుబడిదారీ విధానంలో భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు అవుతుంది’అని వ్యంగంగా ట్వీట్లో తెలిపారు. I am waiting for @JM_Scindia reply , which is most likely to why do you travel by business class? why not economy class?. I am sure mr @PChidambaram_IN as strewed politician and professional would have checked economy fare also from Chennai to Delhi ,which is around 30000 these… — Pravesh Jain (@PRAVESHPARAS) June 18, 2023 చిదంబరానికి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎలా స్పందిస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మీరు బిజినెస్ క్లాస్‌లో ఎందుకు ప్రయాణం చేస్తారు? ఎకానమీ క్లాస్‌లో ఎందుకు ప్రయాణించరు? చిదంబరం ఒక తెలివిగల రాజకీయవేత్త. ప్రొఫెషనల్‌గా చెన్నై-ఢిల్లీ నుండి ఎకానమీ ఛార్జీలను కూడా తనిఖీ చేసి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదీ చదవండి : రూ.88,000 కోట్ల విలువైన రూ.500 నోట్ల మిస్సింగ్.. స్పందించిన ఆర్బీఐ! -
కశ్మీర్ అంశం, చిదంబరం అరెస్ట్ రహస్యమిదే!
సాక్షి, చెన్నై: దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. దేశ జీడీపీ 5శాతానికి పడిపోవడంపై ఎన్డీఏ సర్కార్‌ను డీఎంకే తీవ్రంగా దుయ్యబట్టింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 5 శాతానికి పడిపోవడం చాలా ఆందోళనకరమైందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ బుధవారం విమర్శించారు. గత 27 ఏళ్లలో ఇంత బలహీనమైన జీడీపీ వృద్ధి గణాంకాలను చూడలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘భయంకరమైన' ఆర్థిక మందగమనాన్ని దాచిపెట్టడానికే కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం అరెస్ట్‌లాంటి అంశాలను కేంద్రం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఆర్థిక మందగమనాన్ని కప్పిపుచ్చే ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరుగుతోందన్నారు. అయితే దీనికి సంబంధించి మీడియాలో వార్తలు రాకుండా నిరోధించినప్పటికీ, ఆర్థిక పరిస్థితిపై సోషల్ మీడియాలో విరివిగా వార్తలొచ్చాయని స్టాలిన్ పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రుల మూడు దేశాల పర్యటనపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఇది టూరింగ్ కేబినెట్ అనివ్యాఖ్యానించారు. 2015, 2019 సంవత్సరాలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌ను ఏఐడీఎంకే ప్రభుత్వం నిర్వహించిందని గుర్తుచేసిన ఆయన పెట్టుబడులు, ఉద్యోగాలపై పళని ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా పెట్టుబడులను ఆకర్షించేందుకు పళని స్వామి బృందం ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 10 వరకు అమెరికా, బ్రిటన్ సహా మూడుదేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. -
తమిళనాట పరిణామాలపై కాంగ్రెస్ నేత దిగ్భ్రాంతి!
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి ఎన్నికకావడంపై కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులోని ప్రస్తుత పరిస్థితులు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. శశికళకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదని, ముఖ్యమంత్రి కావడానికి ఆమెకు అర్హత లేదని ఆయన వ్యాఖ్యానించారు. శశికళపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. శశికళను ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నప్పటికీ, ఆమె ప్రమాణస్వీకారంపై అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో చిన్నమ్మ ప్రమాణం ఎప్పుడనేది ఇంకా తేలడం లేదు. -
బీజేపీవి విచ్ఛిన్నకర రాజకీయాలు
కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ధ్వజం ఓటర్ల మనసులను విషపూరితం చేస్తోందని వ్యాఖ్య మధురై: అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి వివాదాస్పద అంశాలను మేనిఫెస్టోలో చేర్చడం ద్వారా బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. ఆ పార్టీకి ఓటు వేయనివారిని వదిలేసి, మోజార్టీ వర్గాల ఓట్లను దండుకునేందుకు వారి మనసులను విషపూరితం చేస్తోందని మండిపడ్డారు. ఆయన మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. రామమందిరం, ఉమ్మడి పౌరస్మృతి, జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేయడం వంటి వివాదాస్పద అంశాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాయని, అంతేకాకుండా సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తాయని పేర్కొన్నారు. ‘‘వారు(బీజేపీ) ప్రజల్లోని అన్ని వర్గాల ఓట్లనూ పట్టించుకోవడంలేదు. మెజార్టీల ఓట్లను మాత్రమే పొందాలన్నది వారి అజెండా. మైనార్టీల ఓట్లు తమకు అవసరం లేదని వారు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. వారి ప్రయత్నమంతా మెజార్టీ ఓట్ల కోసమే’’ అని దుయ్యబట్టారు. పదేళ్లుగా ఈ అంశాల్ని పక్కనపడేసి డ్రామాలాడిన బీజేపీ.. ఇప్పుడు ఎన్నికల సమయంలో విషపూరిత ఆలోచనలతో ఓటర్లను కలుషితం చేయాలని భావిస్తోందని మండిపడ్డారు. ఇందులో భాగంగా తమ సొంత ఓటుబ్యాంకును సంఘటితం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. తమకు ఓటు వేయనివారి సంక్షేమం గురించి బీజేపీ పట్టించుకుంటుందని తాను భావించడంలేదని చెప్పారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన విధానాలు, పథకాలకు కాపీయే బీజేపీ మేనిఫెస్టో అని ఆరోపించారు. వారు తమ ఐడియాలన్నీ కాపీ చేశారని విమర్శించారు. కాపీ చేయడం తప్పు కాదని, అయితే వారు దాన్ని అంగీకరించాలని పేర్కొన్నారు. -
రాష్ట్రపతితో గవర్నర్ భేటీ
హోం, ఆర్థిక మంత్రులతోనూ నరసింహన్ సమావేశం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలన విధింపుతో రాష్ట్ర పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వచ్చిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. రాష్ట్ర పాలనా వ్యవహారాలను రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన వివిధ అంశాల్లో తాజా స్థితిగతులను వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం పనిచేస్తున్న కమిటీల వివరాలను, వచ్చే మూడు నెలల్లో కార్యాచరణను ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అలాగే అపాయింటెడ్ డే నుంచి 14వ ఆర్థిక సంఘానికి సిఫారసు చేసే నాటికి సీమాంధ్రకు రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు అవసరమైన నిధులపై కూడా అంచనాలను ఆర్థిక శాఖ మంత్రికి వివరించినట్టు సమాచారం. అయితే తన పర్యటన సాధారణమైనదేనని, ఎలాంటి ప్రాధాన్యం లేదని నరసింహన్ పేర్కొన్నారు. ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసిన ఆయన మధ్యాహ్నం హోం మంత్రి, ఆర్థిక మంత్రితో విడివిడిగా సమావేశమయ్యారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను మర్యాదపూర్వకంగానే కలిశానని, సాధారణ పర్యటనలో భాగంగానే ఢిల్లీకి వచ్చానని తెలిపారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలతో పాటు పలు అంశాలను కేంద్ర హోం, ఆర్థిక మంత్రులకు వివరించినట్టు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని తాను కోరుకుంటున్నానని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటానని వివరించారు. సీఎంగా ఉన్నప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి నియమించిన కొందరు అధికారులను వెనక్కి పంపిన నేపథ్యంలో ఇంకా ఎవరినైనా మార్పు చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... సాధారణ బదిలీల్లో భాగంగానే అవి జరిగాయని నరసింహన్ చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డి చివరిలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష జరుపుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవమెంత? అని ప్రశ్నించగా... అవి మీకే (మీడియాకే) తెలియాలంటూ సమాధానం దాటవేశారు. బాధ్యతలు తీసుకుని రెండే రోజులైనందున మిగతా విషయాలను త్వరలోనే పరిశీలిస్తానని, వీలును బట్టి ప్రధానమంత్రితో భేటీ అవుతానని చెప్పారు. -
మాజీ సైనికులకు వరం
* ఇకపై ర్యాంకులవారీగా సమాన పెన్షన్ * చిరకాల డిమాండ్‌కు కేంద్రం అంగీకారం * 30 లక్షల మంది మాజీ సైనికులకు లబ్ధి న్యూఢిల్లీ: ఒక ర్యాంకుకు ఒకే రకమైన పెన్షన్ ఉండాలన్న సాయుధ బలగాల దీర్ఘకాలిక డిమాండ్‌కు కేంద్రం అంగీకారం తెలిపింది. సోమవారం మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చిదంబరం ఈ మేరకు ప్రకటన చేశారు. దీని అమలు కోసం 2014-15లో రూ.500 కోట్లను రక్షణ బడ్జెట్ ఖాతాకు బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. దాదాపుగా 30 లక్షల మంది మాజీ సైనికులకు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. ఒకే ర్యాంకు, ఒకే సర్వీసున్న మాజీ సైనికులకు వారెప్పుడు రిటైరయ్యారన్న దానితో నిమిత్తం లేకుండా ఇకపై సమాన పెన్షన్ లభించనుంది. 2006కు ముందు రిటైరైన సైనికోద్యోగులకు ఆ తర్వాత రిటైరైన వారితో పోలిస్తే ప్రస్తుతం తక్కువ పెన్షన్ లభిస్తోంది. అది వారికంటే తక్కువ ర్యాంకుతో రిటైరైన వారికిస్తున్న పెన్షన్ కంటే కూడా తక్కువగా ఉంది! ఈ తేడాలను సరిచేస్తూ తీసుకున్న తాజా నిర్ణయం 2014-15 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ నిర్ణయంపై మాజీ సైనికోద్యోగులు పెదవి విరుస్తున్నారు. పథకాన్ని పూర్తిగా అమలు చేసేందుకు కనీసం రూ.2,500 కోట్లు కావాల్సి ఉంటే రూ.500 కోట్లు ఏ మూలకు చాలతాయని ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ నిర్ణయాన్ని 2006 నుంచి వర్తించేలా అమలు చేయకపోవడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాహుల్ వల్లే: కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల దృష్టితో తీసుకున్న ఈ నిర్ణయం తాలూకు ఘనతను సబ్సిడీ సిలిండర్ల సంఖ్య పెంపు మాదిరిగానే రాహుల్‌గాంధీకే కట్టబెట్టేలా కాంగ్రెస్ ముందే వ్యూహరచన చేసింది. అందులో భాగంగా ఆయన నోట ముందుగానే ఈ డిమాండ్‌ను విన్పించింది. ఒక ర్యాంకు, ఒకే పెన్షన్ విధానం వీలైనంత త్వరగా అమలయ్యేలా కృషి చేస్తానని ఫిబ్రవరి 14న మాజీ సైనికోద్యోగులకు రాహుల్ హామీ ఇచ్చారు. తర్వాత మూడు రోజులకే చిదంబరం నోట ఆ మేరకు విధాన ప్రకటన వెలువడింది! ఆ వెంటనే సోనియా నివాసం 10, జన్‌పథ్‌లో రాహుల్ విలేకరులతో మాట్లాడారు. ఈ నిర్ణయంపై హర్షం వెలిబుచ్చడంతో పాటు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇదో చరిత్రాత్మక నిర్ణయం. దేశం కోసం పోరాడేందుకు నిత్యం సన్నద్ధంగా ఉండే బలగాలకు అన్నిరకాలుగా మద్దతుగా నిలవడం మన కర్తవ్యం’’ అన్నారు. రాహుల్ చొరవ వల్లే ఈ నిర్ణయం వచ్చిందంటూ కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా స్తోత్రపాఠాలు వల్లెవేశారు. గృహావసరాల సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 9 నుంచి 12కు పెంచాల్సిందేనని ఏఐసీసీ సదస్సు వేదికగా గత నెలలో రాహుల్ డిమాండ్ చేయడం, ఆ మేరకు పెంచేస్తున్నామంటూ అదే వేదిక నుంచి పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ నాటకీయ ఫక్కీలో ప్రకటన చేయడం తెలిసిందే. భారత సైన్యంలో ప్రస్తుతం 14 లక్షల మంది సైనికులున్నారు. రిటైరైన సైనికుల సంఖ్య 24 లక్షలు. హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానాల్లో వీరిది బలమైన ఓటు బ్యాంకు కావడం లోక్‌సభ ఎన్నికల్లో ఆయా చోట్ల తనకు కలిసొస్తుందన్నది కాంగ్రెస్ అంచనా. ‘రక్షణ’పై శీతకన్నే న్యూఢిల్లీ: 2014-15 మధ్యంతర బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు 10 శాతం పెరిగాయి. గతేడాది రూ.2.03 లక్షల కోట్లున్న కేటాయింపులను తాజాగా రూ.2.24 లక్షల కోట్లకు చిదంబరం పెంచారు. అయితే బలగాల ఆధునికీకరణలో భాగంగా తెర తీసిన పలు ఆయుధ సేకరణ ఒప్పందాలు కొలిక్కి వస్తున్న తరుణంలో ఈ మొత్తం ఏ మేరకు చాలుతుందన్నది సందేహమే. పైగా ఆధునికీకరణ కోసం అదనంగా రూ.40 వేల కోట్లు కేటాయించాలన్న రక్షణ శాఖ విజ్ఞప్తిని గతేడాదిలాగే ఈసారీ చిదంబరం తోసిపుచ్చారు. ఏడాది కాలంగా తెర పైకి వచ్చిన పలు రక్షణ కుంభకోణాల నేపథ్యం లో ఈ రంగాన్ని దేశీ బాట పట్టించాలని, అందులో భాగంగా సాయుధ సంపత్తి దిగుమతిని వీలైనంతగా తగ్గించాలని ఇటీవల నిర్ణయించారు. అయినా పలు దేశాలతో పలు ఆయుధ కొనుగోలు ఒప్పందాలు ఇప్పటికే తుది దశలో ఉన్నాయి. వాటిలో కొన్ని: - 126 బహుళార్థ సాధక యుద్ధ విమానాలు - 22 అపాచీ యుద్ధ హెలికాప్టర్లు - 15 చింకూ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు - 126 రాఫెల్ యుద్ధ విమానాలు - రష్యాతో ఐదో తరం యుద్ధ విమాన ఒప్పందం తుది దశ చర్చల్లో ఉంది. దీనిపై వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో ఏకంగా రూ.1.5 లక్షల కోట్లు వెచ్చించాలని సంకల్పించారు! లోక్‌పాల్‌కు రూ. 2 కోట్లే దేశంలో అవినీతి నిరోధానికి ఉద్దేశించిన లోక్‌పాల్‌కు ఈ బడ్జెట్లో నామమాత్రంగా కేవలం రూ. 2 కోట్లనే కేటాయించింది. లోక్‌పాల్ బిల్లుకు ఈ ఏడాది జనవరి 1న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సంస్థాగత ఖర్చులకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు ప్రణాళికేతర పద్దుల కింద రూ.20.35 కోట్లను కేటాయించింది. -
మార్కెట్ బూస్ట్
97 పాయింట్లు అప్ 20,464 వద్దకు సెన్సెక్స్ నెల రోజుల గరిష్టమిది ఎఫ్ఐఐల పెట్టుబడులు ఓకే మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన పన్ను తగ్గింపులు స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహమిచ్చాయి. లోక్‌సభలో ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన స్వల్పకాలిక బడ్జెట్లో ఆటో, భారీయంత్రపరికరాలు వంటి రంగాలకు ఉపశమనాన్ని కల్పిస్తూ ఎక్సైజ్ డ్యూటీలలో 2-6% మధ్య కోత విధించడం సెంటిమెంట్‌కు బలాన్నిచ్చింది. వెరసి సెన్సెక్స్ 97 పాయింట్లు లాభపడి 20,464 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా 25 పాయింట్లు లాభపడి 6,073 వద్ద నిలిచింది. కాగా, ఉదయం 11.11 ప్రాంతంలో బడ్జెట్ ప్రసంగం మొదలుకాగానే సెన్సెక్స్ 20,339 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకడం గమనార్హం. ఈ ఏడాదికి ద్రవ్యలోటును 4.6%కు కట్టడి చేయడంతోపాటు, కరెంట్ ఖాతా లోటు 45 బిలియన్ డాలర్లకు పరిమితంకానున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. టాటా పవర్ 5% అప్ సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్ 5% పుంజుకోగా, ఆటో షేర్లు ఎంఅండ్ఎం, హీరో మోటో, మారుతీ 2.8-1.4% మధ్య లాభపడ్డాయి. ఈ బాటలో డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ ద్వయం, యాక్సిస్ బ్యాంక్ 2-1% మధ్య పెరిగాయి. అయితే మరోవైపు కోల్ ఇండియా, హిందాల్కో, ఆర్ఐఎల్ 1.5% స్థాయిలో నష్టపోయాయి. ట్రేడైన షేర్లలో 1,373 నష్టపోగా, 1,235 బలపడ్డాయి. -
పేదోడి ఫోన్ మరింత ఖరీదు
అన్ని ఫోన్లపై ఇక 6 శాతం పన్ను... రూ.2,000 లోపు మొబైల్స్‌పై భారం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సామాన్యుడి ఫోన్ ఇప్పుడు మరింత ఖరీదు కానుంది. చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ పుణ్యమాని రూ.2 వేల లోపు ధర ఉన్న ఫోన్లు కూడా ప్రియం కానున్నాయి. ఇప్పటి వరకు ఈ ఫోన్లకు ఎక్సైజ్ డ్యూటీ 1 శాతం మాత్రమే. తాజా బడ్జెట్‌తో స్మార్ట్ఫోన్లకు సమానంగా ఎక్సైజ్ డ్యూటీ 6 శాతానికి చేరింది. దీంతో ఒక్కో ఫోన్‌పై రూ.40 నుంచి రూ.90 దాకా అదనంగా చెల్లించాల్సిందే. నెలకు ఒక కోటి బేసిక్ ఫోన్లు దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్నాయి. అంటే నెలకు ఒక కోటి మంది భారతీయులపై భారం పడనుందన్న మాట. రాష్ట్రంలో ఇటువంటివి నెలకు 8 లక్షల ఫోన్లు విక్రయమవుతున్నాయి. ఈ కొత్త సుంకాలు సోమవారం నుంచే అమలులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్లపై ఎక్సైజ్ డ్యూటీ సెన్‌వ్యాట్ క్రెడిట్‌తో 6 శాతం, సెన్‌వ్యాట్ క్రెడిట్ లేకుండా 1 శాతమని ఆర్థిక మంత్రి తన బడ్జెట్లో ప్రతిపాదించారు. కాగా, 2013-14 బడ్జెట్లో రూ.2 వేలు ఆపై ఖరీదున్న ఫోన్లకు ఎక్సైజ్ డ్యూటీని 6 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. కొత్త ధరలు ఇప్పటి నుంచే.. రూ.2 వేల లోపు ఖరీదున్న ఫోన్ల ధర 7 శాతం దాకా పెరిగే అవకాశం ఉందని కార్బన్ మొబైల్స్ ఛైర్మన్ సుధీర్ హసిజ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. నేడో, రేపో కొత్త ధరలు అమలులోకి రానున్నాయని చెప్పారు. దేశీయంగా ప్లాంట్లు పెట్టడం ద్వారా కంపెనీలకు పన్ను మినహాయింపులుంటాయని వివరించారు. డొమెస్టిక్ టారిఫ్ ఏరియాలో ఏర్పాటు చేసే యూనిట్లు ఎక్సైజ్ డ్యూటీ 6%కి బదులు 1 శాతమే చెల్లిస్తాయని, ఈ మేరకు కంపెనీలకు కలసి వస్తుందని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ పేర్కొన్నారు. నోకియా ఇండియా ఎండీ పి.బాలాజీ మాట్లాడుతూ దేశీయ మొబైల్ తయారీ పరిశ్రమను ప్రోత్సహించే చర్యలంటూ చిదంబరం బడ్జెట్‌ను స్వాగతించారు. అయితే లో-ఎండ్ ఫోన్లు కొనేవారిపై మాత్రం భారం తప్పదన్నారు. 12 కోట్ల ఫోన్లపై..: దేశవ్యాప్తంగా ఏటా సుమారు 22 కోట్ల ఫోన్లు అమ్ముడవుతున్నాయి. భారతీయ బ్రాండ్లవి 15.4 కోట్లుంటాయి. మొత్తం అమ్ముడవుతున్న ఫోన్లలో రూ.2 వేలలోపు ఖరీదున్నవి 12 కోట్ల ఫోన్లు ఉంటాయని అంచనా. మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్కాన్, లావా, వీడియోకాన్, ఇంటెక్స్ తదితర భారతీయ బ్రాండ్లు చైనా, థాయ్, కొరియాల నుంచి ఫోన్లను దిగుమతి చేసుకుంటున్నాయి. శాంసంగ్, నోకియాకు మాత్రమే భారత్‌లో సొంత ప్లాంట్లున్నాయి. ప్రోత్సాహమే లేదు.. పన్నులు పెంచాం కాబట్టి దేశీయంగా ప్లాం టు పెట్టండి అంటే ఎలా? ప్లాంటు పెట్టడం వల్ల ఆ రాష్ట్రంలో మాత్రమే పన్ను మినహాయింపు వస్తుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వ్యాట్ వసూలు చేస్తున్నారు. అందుకే జీఎస్టీ త్వరితగతిన అమలులోకి రావాలని పారిశ్రామికవర్గాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. తక్కువ ధరకు స్థలం, నిరంతర విద్యుత్, నీటి సరఫరా, పన్ను మినహాయింపులు కల్పించాలి. పన్ను పెరిగింది కాబట్టి ఫోన్ల ధర పెంచక తప్పదు. - వై.గురు, సెల్కాన్ సీఎండీ