Business Class ticket
-
విమాన టికెట్ ధరలు చాలా తక్కువేనంటూ.. కేంద్రంపై చిదంబరం సెటైర్లు!
విమాన టికెట్ ధరలపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో వ్యంగంగా ట్వీట్ చేశారు. రెండు విమాన సంస్థలకు చెందిన ఢిల్లీ - చెన్నై బిజినెస్ క్లాస్ టికెట్ ధరలు రూ.63,000, రూ.57,000 చాలా తక్కువేనని అన్నారు. ‘ఢిల్లీ- చెన్నై విస్తారా, ఎయిరిండియా బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. రూ.6300, రూ.5700 చాలా తక్కువ.‘అయ్యో, క్షమించండి టికెట్ ధరలు తక్కువగానే ఉన్నాయి. ఒక విమాన టికెట్ ధర రూ.63,000, మరో విమాన టికెట్ ధర రూ.57,000 ఉన్నాయని ట్వీట్ చేశారు. భారత్ స్వేచ్ఛా మార్కెట్. డిమాండ్ పెరిగినప్పుడు సరఫరా పెరుగుతుంది, ”అని ట్వీట్లో పేర్కొన్నారు. Delhi-Chennai Business Class air tickets on Vistara and Air India have been set at a 'reasonable' price of Rs 6300 and Rs 5700 respectively Oops, sorry, they are set at a 'very reasonable' Rs 63,000 and Rs 57,000 respectively In free markets, when demand increases, supply will… — P. Chidambaram (@PChidambaram_IN) June 18, 2023 ‘భారత్ ఫ్రీ మార్కెట్. డిమాండ్ పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి. విమానయాన సంస్థలు తమ మార్గాలను విస్తరిస్తాయి. పాత మార్గాల్లో విమానాలను తగ్గించి వాటి ధరల్ని పెంచుతాయి. గుత్తాధిపత్య పెట్టుబడిదారీ విధానంలో భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు అవుతుంది’అని వ్యంగంగా ట్వీట్లో తెలిపారు. I am waiting for @JM_Scindia reply , which is most likely to why do you travel by business class? why not economy class?. I am sure mr @PChidambaram_IN as strewed politician and professional would have checked economy fare also from Chennai to Delhi ,which is around 30000 these… — Pravesh Jain (@PRAVESHPARAS) June 18, 2023 చిదంబరానికి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎలా స్పందిస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మీరు బిజినెస్ క్లాస్‌లో ఎందుకు ప్రయాణం చేస్తారు? ఎకానమీ క్లాస్‌లో ఎందుకు ప్రయాణించరు? చిదంబరం ఒక తెలివిగల రాజకీయవేత్త. ప్రొఫెషనల్‌గా చెన్నై-ఢిల్లీ నుండి ఎకానమీ ఛార్జీలను కూడా తనిఖీ చేసి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదీ చదవండి : రూ.88,000 కోట్ల విలువైన రూ.500 నోట్ల మిస్సింగ్.. స్పందించిన ఆర్బీఐ! -
‘తప్పట్లేదు.. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం, ఫైవ్ స్టార్ హోటళ్లలో బస వద్దు’
గత కొంత కాలంగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఆ దేశ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది పాక్. ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన పొదుపు చర్యల్లో భాగంగా తమ మంత్రులు ఇకపై 5-స్టార్ హోటళ్లలో బస, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం చేయవద్దని స్పష్టం చేసింది. కీలక నిర్ణయం.. అవి బంద్ ఇస్లామాబాద్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో షరీఫ్ మాట్లాడుతూ.. ‘మనం సమయానుకూలంగా నడుచుకోవాలి. కాలం మన నుంచి ఏమి కోరుతుందో వాటిని ఇవ్వాల్సి ఉంటుందని’ షరీఫ్ అన్నారు. పెరుగుతున్న అప్పులు, ప్రపంచ ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరతల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు గతంలో ప్రభుత్వం తన ఉద్యోగుల జీతాలను తగ్గించడంతో పాటు సమాఖ్య మంత్రుల సంఖ్యను మరింత తగ్గించింది. వీటితో పాటు మంత్రిత్వ శాఖలు, విభాగాల ఖర్చులను చాలా వరకు అరికట్టింది. దీంతోపాటు లగ్జరీ వస్తువులు, కార్ల కొనుగోలుపై కూడా వచ్చే ఏడాది వరకు పాక్ ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. అంతేకాకుండా ప్రభుత్వం ఖర్చు తగ్గించే చర్యలలో $764 మిలియన్ల ప్రణాళికను కూడా పాటిస్తోంది. తద్వారా ఐఎంఎఫ్ నుంచి నిధులు పొందాలనే ఆలోచనలో ఉంది. సబ్సిడీలను తొలగించాలని ఐఎంఎఫ్ చేసిన అభ్యర్థనను అనుసరించి, పాకిస్తాన్ లగ్జరీ దిగుమతులపై సుంకాలను పెంచింది. ఇంధన ధరలను పెంచడంతో పాటు ఈ వారం ప్రారంభంలో కరెన్సీని తగ్గించింది. అదనంగా, ఐఎంఎఫ్ మార్కెట్ నిర్ణయించిన కరెన్సీ రేటును అనుమతించాలని సూచించింది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం దెబ్బకు అటు సామాన్యులను మాత్రమే కాకుండా సైన్యాన్ని కూడా ప్రభావితం చేసింది. సరఫరాలో కోత కారణంగా పాకిస్తాన్ సైన్యం మెస్‌లలో ఆహార కొరత సమస్యలను ఎదుర్కొంటోంది. చదవండి : 'పుతిన్‌కు నెక్ట్స్ బర్త్‌డే లేదు.. ఏడాది కూడా బతకడు..!' -
ఆ హీరోయిన్లంటే అసహ్యం
నటి ప్రణీత ఏదో ఒక వివాదంతో వార్తల్లో కెక్కే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో రీ ఎంట్రీ అయిన ఈ భామ ఇంతకుముందు కార్తీ సరసన శకుని చిత్రంలో నటించారు. ఆ చిత్రం ప్లాప్ అవడంతో ప్రణీత మూటాముల్లు సర్దుకుని టాలీవుడ్లో మకాం పెట్టారు. అక్కడ అత్తారింటికి దారేది చిత్రం ఆమెకు విజయాన్నిందించింది. ఆ చిత్ర దర్శకుడు తదుపరి చిత్రంలో కూడా అవకాశం ఇచ్చినా దీన్ని కాలదన్నుకున్నారు. అలాంటి సమయంలో తమిళంలో ఎమిజాక్సన్ వదులుకున్న సూర్య సరసన నటించే అవకాశం ప్రణీతకు వరించింది. ఆ చిత్రం పేరు మాస్. ఇందులో ప్రధాన హీరోయిన్గా నయనతార నటిస్తున్నారు. కాగా చాలామంది హీరోయిన్లు విమాన ప్రయాణాల్లో బిజినెస్క్లాస్ టికెట్ కావాలి, షూటింగ్ స్పాట్లో క్యారవాన్ వ్యాన్ సౌకర్యాలు కావాలని డిమాండ్ చేస్తుంటారు. అయితే తను అలాంటి డిమాండ్లు చేయనంటున్నారు నటి ప్రణీత. ఇటీవల షూటింగ్ ముగించుకుని హైదరాబాదు నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఈ బ్యూటీ విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్‌తో కాకుండా ఎకానమీ టికెట్‌తో ప్రయాణం చేశారట. దీని గురించి ఆమె తెలుపుతూ విమానంలో పయనించడానికి బిజినెస్ క్లాస్ టికెట్టే కావాలని డిమాండ్ చేసే నటిని కానన్నారు. సూపర్‌స్టార్ మమ్ముట్టి, రాహుల్ ద్రావిడ్ లాంటి ప్రముఖులు కూడా ఎకానమీ టికెట్‌తోనే ప్రయాణం చేయడం చూశానన్నారు. అలాంటి ప్రయాణాల్లో అభిమానుల్ని కలుసుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. తాను ఎక్కువగా ఎకానమీ టికెట్‌తోనే పయనిస్తున్నానన్నారు. ఇలాంటి విషయాల్లో తానెప్పుడూ సంకటపడిన సందర్భాలు లేవన్నారు. అలాంటి విషయాల్లో బందా చూపే హీరోయిన్లంటే అసహ్యం అని ప్రణీత పేర్కొన్నారు. -
శ్రమల బడిలోనే విశ్వాసికి అమూల్య పాఠాలు
రక్షింపబడిన మరుక్షణం విశ్వాసి దేవుని రాజ్యనిర్మాణ కార్యక్రమంలో శ్రామికుడవుతాడు. అలా శ్రామికుడిగా అతనికి విధి నిర్వహణ నేర్పేందుకుకే దేవుడు శ్రమల బడిలో చేర్చుతాడు. అమెరికాలో ఒక అమ్మాయికి చాలా విచిత్రమైన జబ్బు. ఆమె ఎంతో ఆరోగ్యవంతురాలు. కాని ‘నొప్పి’ అనేది ఆమెకు తెలియదు. చేయి లేదా కాలు మంటల్లో పడి కాలిపోతున్నా, అవి శరీరం నుండి వేరవుతున్నా ఆమెకు నొప్పి కలుగదు. ఆ విషయమే ఆమెకు తెలియదు. శరీరంలోని నాడీ వ్యవస్థలోని ఒక జన్యులోపం వల్ల ఆ పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా తల్లిదండ్రులు ఆమెను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడాల్సిన పరిస్థితుల్లో ‘ప్రభువా, మా కూతురుకు నొప్పి కలిగించు!’అని ప్రభువును ప్రతిరోజూ ప్రార్థిస్తారట! నొప్పి, శ్రమ, వైఫల్యం, అవమానం.. ఈ అనుభవాలగుండా ప్రయాణించకుండా ‘విశ్వాసి ఈ లోకంలో అజేయుడు కాలేడు. విశ్వాసి మాత్రమే కాదు, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు అయిన దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు కూడా శ్రమలు సహించడం ద్వారా విధేయతను నేర్చుకొని మానవాళి రక్షణ యావత్తుకు కారకుడయ్యాడని బైబిలు చెబుతోంది (హెబ్రీ 5:8-10, 12:2). విశ్వాసి ఈ లోకంలో ఎదుర్కోగలిగిన ప్రతి బోధనను, వేదన ను, అనుభవాన్ని దేవుడై యుండి కూడా యేసుక్రీస్తు ఎదుర్కొన్నాడని, అందుకే సమయోచితమైన కృప, సహాయం కొరకు మానవాళి ధైర్యంగా ఆయన కృపాసనాన్ని సమీపించే అవకాశం లభించిందని హెబ్రీ గ్రంథకర్త సెలవిస్తాడు (హెబ్రీ 4:15,16) నొప్పి లేకుండా ప్రసవించే పద్ధతులు కనుగొన్నట్టే, మానవుడు ‘నొప్పి’ని తన జీవితంలో నుండి సమూలంగా దూరం చేసేందుకు, దాన్ని పూర్తిగా నిషేధించేందుకు ఇంతవరకూ చేయని ప్రయత్నం లేదు. అయితే ఆ విషయంలో సఫలీకృతుడు కాలేకపోతున్నాడు. దేవుడు మాత్రం శ్రమలను, బాధలను విశ్వాసికి తర్ఫీదునిచ్చే ప్రత్యేక పాఠశాలలుగా నియమించాడు. మనకు నొప్పి, శ్రమ కలిగించడం వెనుక దేవుని సంకల్పముందని మర్చిపోరాదు. సౌవార్తిక చరిత్రలో ప్రసిద్ధులైన దైవసేవకులంతా మహాశ్రమలు, వైఫల్యాలు, ప్రతికూలతలగుండా ప్రయాణించి దేవుని సంకల్పాలకు తలవంచి జీవన సాఫల్యాన్ని సంతృప్తిని పొందినవారే! రక్షింపబడిన మరుక్షణం విశ్వాసి దేవుని రాజ్యనిర్మాణ కార్యక్రమంలో శ్రామికుడవుతాడు. అలా శ్రామికుడిగా అతనికి విధి నిర్వహణ నేర్పేందుకుకే దేవుడు శ్రమల బడిలో చేర్చుతాడు. అయితే శ్రమలు అందర్నీ పరిపూర్ణంగా తయారు చేస్తాయనుకుంటే అది పొరపాటు. దేవుని సంకల్పం మేరకు పిలువబడిన ప్రత్యేకమైన విశ్వాసులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలసట, శ్రమ ఎరుగకుండా పరలోకానికి బిజినెస్ క్లాస్ టికెట్ మీద విమానంలో వెళ్లాలనుకుంటారు చాలామంది. కాని విశ్వాస నిరూపణలో ఈ లోకంలో శ్రమలు పొందడం దేవుడు నియమించిన విధివిధానమని వారికి తెలియక నిరుత్సాహపడుతూంటారు. దేవుడు నన్ను ప్రేమిస్తే నాకెందుకు ఈ శ్రమ? అని ప్రశ్నిస్తారు కొందరు. దేవుని ప్రేమ ఆయన సొంత కుమారుడైన యేసుక్రీస్తునే శ్రమలనుండి కాపాడే ప్రయత్నం చేయలేదు. మరి ఆ యేసుక్రీస్తు సారూప్యాన్ని తెచ్చిపెట్టే శ్రమలనుండి విశ్వాసిని ఎందుకు కాపాడుతుంది? తన శరీరంలోని ముల్లు తొలగితే తానింకా బలపడతానని పౌలు భావించాడు. కాని ఆ ముల్లును భరించే క్రమంలోనే అత్యధిక బలానికి, తన అత్యధిక కృపకు పాత్రుడనవుతావని దేవుడు ఆయనకు జవాబిచ్చాడు. ( 2 కొరి 12:8). శ్రమల్లో దేవుని నుండి వివరణను కాదు, దేవుని ప్రత్యక్షతను విశ్వాసి కోరుకోవాలి. జీవితాల్లో లోకాన్ని, దేవుని రాజ్య నిర్మాణపు పనిని ‘ఆత్మీయ దృష్టితో చూసేందుకు శ్రమలు, నొప్పి సాయం చేస్తాయి.ఇ అవి విశ్వాసి అతిశయించకుండా, అత్యధికంగా హెచ్చిపోకుండా అణిచి పెడతాయి. పరలోకాన్ని సొంతం చేసుకునే క్రమంలో విశ్వాసికి శ్రమలు తప్పవు. అది దేవుడు ఆస్వాదించే అపూర్వమైన పరిమళాన్ని గాయపడ్డ జీవితాలు, హృదయాలు అలా వెదజల్లుతాయి. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ హితవాక్యం: మనల్ని ఆవరించిన శ్రమలు, బాధలనే కారు మబ్బులకవతల ఎంతో ఎత్తులో నీతిసూర్యుడైన దేవుడున్నాడని మరచిపోవద్దు. - సాధు సుందర్‌సింగ్